హైదరాబాద్ కు మెస్సీ ..  GOAT వెనుకున్న సీక్రెట్ ఏంటి?

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ అనేది దేశవ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది. మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కడం ఫుట్‌బాల్ అభిమానులకు ఇదోక గొప్ప కల అనే చెప్పాలి.

New Update
goat

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ అనేది దేశవ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది. మెస్సీని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కడం ఫుట్‌బాల్ అభిమానులకు ఇదోక గొప్ప కల అనే చెప్పాలి. అందుకే ఆయన టూర్ షెడ్యూల్, కార్యక్రమాలు, టిక్కెట్ల వివరాలు, ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌పై అందరి దృష్టిని ఆకర్షించింది. మెస్సీ భారత్‌కు రావడం14 ఏళ్ల తర్వాత రెండోసారి కావడం విశేషం.  

'GOAT టూర్'లో భాగంగా మెస్సీ హైదరాబాద్‌ను సందర్శించనున్నారు. ఇంతకు ఈ గోట్ అంటే ఎంటో తెలుసుకుందాం.  G.O.A.T. అంటే Greatest Of All Time (ఎప్పటికప్పుడు గొప్ప ఆటగాడు) అని అర్ధం. లియోనెల్ మెస్సీని ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భావిస్తారు. అందుకే అతని పర్యటనకు 'GOAT ఇండియా టూర్' అని పేరు పెట్టారు. ఈ టూర్ ప్రధానంగా క్రీడాభిమానులను అలరించడానికి, భారతీయ ఫుట్‌బాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడానికి ఏర్పాటు చేశారు. మెస్సీ ఇండియా టూర్‌లో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో పర్యటిస్తారు. 

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 7v7  ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు మెస్సీ.  రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ 20 నిమిషాల పాటు జరుగుతుంది, మ్యాచ్‌ చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్‌, సాకర్‌ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరఫున బరిలోకి దిగుతారు. 

ఒక్క ఫొటోకు రూ.10 లక్షల వరకు

లియోనెల్‌ మెస్సితో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవాలనుకుంటే పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే. ఒక్క ఫొటోకు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ‘ద గోట్‌ టూర్‌’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్‌) సలహాదారు పార్వతిరెడ్డి వెల్లడించారు. కేవలం 100 మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇప్పటికే 60 మందికి పైగా రిజస్టర్ కూడా చేసుకున్నారు.  ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 

Advertisment
తాజా కథనాలు