/rtv/media/media_files/2025/12/15/duvvada-madhuri-srinivas-2025-12-15-13-47-07.jpg)
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి(divvala madhuri and duvvada srinivas latest news). ఈ జంట ఏం చేసినా సంచలనమే అని తెలిసిందే. తాజాగా వారు పాల్గొన్న ఒక బర్త్ డే పార్టీ(birthday party) వివాదస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ బర్త్ డే పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీపై మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు జారీ చేశారు.
Also Read : దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
Another Shock For The Duvvada Couple
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఇటీవల తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్(Moinabad Farm house)లో అనుమతి లేకుండా నిర్వహించిన బర్త్ డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ విషయం రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఐదు హుక్కాలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. కాగా ఈ పార్టీకి హాజరైన దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు మాధురి, ఆమె బంధువు అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థసారథిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. అనంతరం నోటీసులు ఇచ్చి వదిలేశారు.
కాగా, పార్థసారధికి మరోసారి నోటీసు ఇచ్చారు పోలీసులు. కోర్ట్ కేస్ విచారణ ఉన్నప్పుడు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ ఈవెంట్ నిర్వహించింది పార్థసారధి కావడంతో ఆయనపై మాత్రమే కేస్ నమోదు చేసినట్లు తెలిసింది.. అనుమతి లేకుండా పార్టీలో విదేశీ, మద్యం హుక్కా వాడారని నోటీసులో మొయినాబాద్ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ పార్టీలో వీరితో పాటు మరో 26 మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
Also Read : హెడ్‌మాస్టర్ తిట్టాడని.. క్లాస్‌కు రివాల్వర్ తీసుకొచ్చి బెదిరించిన విద్యార్థి
Follow Us