Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. దేవుడి దయవల్ల నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని. అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనన్నారు. ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని కవిత హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి ,చెప్తానని అన్నారు. అధికారంలోకి రాగానే అవినీతి పై విచారణ చేస్తానన్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ అధికారంలోకి వచ్చారు. కానీ, వాటిపై చర్యలేవని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ కు సంబంధం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి ఇంకా బయటపెట్టలేదని అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారని కవిత ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: మౌని అమావాస్య ప్రత్యేకత.. అమృత స్నానం, మౌనవ్రతంతో పుణ్య ఫలం గురించి తెలుసుకోండి!!
సీఎం రేవంత్ చెప్పేది ఒక్కటి చేసేది ఒకటన్నారు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతానన్నారు. తాను తప్పు చేయనని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ ను తాను టార్గెట్ చేయలేదన్నారు. తాను గాంధీ లాగా కేసీఆర్ లాగా మంచిదాన్ని కాదు అని స్పష్టం చేశారు. తనను ఒకటి కొడితే రెండు దెబ్బలు కొట్టేదాన్ని అని చెప్పుకొచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన దానికి తనకు సంబంధం లేదని కవిత అన్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ.. నామీద ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు. నాకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదని కవిత పేర్కొన్నారు.
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామానికి కవిత తెరలేపింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ స్యూస్‌లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కవిత.ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు.తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.తనపై ఆరోపణలు చేస్తున్న వారివెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసు అని. ఆ గుంట నక్క ఎవరో బయటకు రావాలన్నారు. మీ అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హాయాంలో పరిశ్రమల భూమిని నివాస భూమిగా మార్చారని తెలిపారు. దానికి ఆజ్యం పోసింది బీఆర్ఎస్ వాళ్లేనని కవిత ఆరోపించారు.
కాగా, తెలంగాణ జాగృతి జనం బాట పేరిట కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాట చేపట్టినట్లు కవిత ప్రకటించారు. మొదటగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న(గురువారం) నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు కవిత. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను కవిత తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై షాకింగ్ కామెంట్స్ చేశారు కవిత. ఆమె చేసిన వ్యాఖ్యలకు మాధవరం కృష్ణారావు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కవిత నోటీసులు పంపించినట్లు సమాచారం.
Kalvakuntla Kavitha: నేనూ సీఎం అవుతా… ఒక్కొక్కళ్ళ తోలు తీస్తా! : కవిత సంచలన వ్యాఖ్యలు
దేవుడి దయవల్ల నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని. అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనని ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానన్నారు.
Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. దేవుడి దయవల్ల నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా సీఎం అవుతానని. అప్పుడు ఏ ఒక్కరిని కూడా వదలనన్నారు. ఒక్కొక్కళ్ళ తోలు తీస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలను బయటకు తీస్తానని కవిత హెచ్చరించారు. తనకో అవకాశం వస్తుందని అప్పుడు ఒక్కొక్కళ్ళ సంగతి ,చెప్తానని అన్నారు. అధికారంలోకి రాగానే అవినీతి పై విచారణ చేస్తానన్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అవినీతిని ప్రశ్నిస్తూ రేవంత్ అధికారంలోకి వచ్చారు. కానీ, వాటిపై చర్యలేవని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ కు సంబంధం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి ఇంకా బయటపెట్టలేదని అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారని కవిత ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: మౌని అమావాస్య ప్రత్యేకత.. అమృత స్నానం, మౌనవ్రతంతో పుణ్య ఫలం గురించి తెలుసుకోండి!!
సీఎం రేవంత్ చెప్పేది ఒక్కటి చేసేది ఒకటన్నారు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతానన్నారు. తాను తప్పు చేయనని కవిత వెల్లడించారు. బీఆర్ఎస్ ను తాను టార్గెట్ చేయలేదన్నారు. తాను గాంధీ లాగా కేసీఆర్ లాగా మంచిదాన్ని కాదు అని స్పష్టం చేశారు. తనను ఒకటి కొడితే రెండు దెబ్బలు కొట్టేదాన్ని అని చెప్పుకొచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన దానికి తనకు సంబంధం లేదని కవిత అన్నారు.
తనపై ఆరోపణలు చేస్తున్న వారికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే నేను చేసిన ఆరోపణలకు జవాబు చెప్పండి. అంతేకానీ.. నామీద ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకోను. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదు. మీరు చేసిన అక్రమాలను నాపై రుద్దొద్దు. నాకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదని కవిత పేర్కొన్నారు.
Also Read: సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై ఢిల్లీ హైకోర్ట్‌లో పవన్ కళ్యాణ్ కేసు..