National Book Fair : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన..పుస్తకాల పండుగొచ్చింది.

"చినిగిన చొక్కా అయిన వేసుకో..కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు పెద్దలు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రియుల కోసం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను వైభవంగా నిర్వహించనున్నారు.ఈ నెల 19 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది.

New Update
FotoJet (15)

Hyderabad National Book Fair

National Book Fair "చినిగిన చొక్కా అయిన వేసుకో..కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు పెద్దలు. అయితే నేటి ఆధునిక కాలంలో పుస్తకం కొనడం అటుంచితే, కనీసం చదివేవారు కూడా కరువవుతున్నారు. నేటి డిజిటల్‌ యుగంలో అక్షరానికి ఆదరణ తగ్గలేదని నిరూపిస్తున్నాయి పుస్తక ప్రదర్శనలు.  కొత్త పుస్తకం పరిచయం కావడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక  ప్రముఖ రచయితలు, పబ్లిషర్లను కలుసుకునేలా చేయాలి. సాహిత్య ప్రియులు కోరుకునేది ఇదే. ఇలాంటి వారికోసం ‘పుస్తకాల ప్రదర్శన’లు ఏర్పటవుతున్నాయి. ఏడాది కొకసారి సాగే ఈ ప్రదర్శనలు దేశవ్యాప్తంగా ఉన్న పుస్తక ప్రియులకు  స్వాగతం పలుకుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పుస్తక ప్రదర్శనలను ఏటా ఒకే చోట నిర్వహిస్తుంటారు. ఈ నెల 19 నుంచి హైదరాబాద్‌,  ఆ తర్వాత విజయవాడ పుస్తక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. - Hyderabad Book Fair Yakob

157d6a70-6f3c-460a-9ddc-f3f7d49df398

Also Read :  ఫ్యామిలీ పంచాయతీ...అయినోళ్లే ప్రత్యర్థులు

14వ శతాబ్ధం నుంచే..

పుస్తక ప్రదర్శన అనేది కొత్తదేమి కాదు. తొలిసారి14వ శతాబ్దంలోనే పుస్తక ప్రదర్శన ఏర్పాటైంది.  జర్మనీలో ‘ఫ్రాంక్‌ఫర్ట్‌ బుక్‌ ఫెయిర్‌’ను 1462లో మొదటిసారి నిర్వహించినట్టు పలు శాస్త్రీయ ఆధారలున్నాయి. ఈ బుక్‌ఫెయిర్‌కు ప్రపంచంలోనే ‘అతి పెద్ద పుస్తక ప్రదర్శన’గా గుర్తింపు వచ్చింది.  నేటికి ఈ ప్రదర్శన సాగుతోంది. ఎక్కువమంది ఎగ్జిబిటర్లు పాల్గొనే పుస్తక ప్రదర్శన కూడా ఇదే. ఏటా అక్టోబర్‌ నెలలో దీన్ని నిర్వహిస్తారు. గూటెన్‌బర్గ్‌ ఆధునిక బుక్‌ ప్రింటింగ్‌ను కనుగొన్న తరువాత 1462లో మొదటిసారి బుక్‌ ఫెయిర్‌ను నిర్వహించారు. తరువాత 1949లో ఆధునిక విభాగం ప్రారంభమయింది. అప్పటి నుంచి ఏటా బుక్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. సుమారు వంద దేశాలకు చెందిన 7వేల ఎగ్జిబిటర్లు, లక్షా 70వేల మంది ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్‌ ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి 3 లక్షల మంది పుస్తక ప్రియులు ఈ ప్రదర్శనను సందర్శిస్తున్నారు. వచ్చే ఏడాది 2026 బుక్‌ ఫెయిర్‌ అక్టోబర్‌ 7 నుంచి 11 వరకు జరుగుతుంది. - hyderabad-book-fair

247d9a7f-803d-4398-b986-853431157612

ఢిల్లీలో పురాతన పుస్తక ప్రదర్శన

ఇక మనదేశంలో రెండో పురాతన పుస్తక ప్రదర్శనగా ‘న్యూఢిల్లీ వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌’కు గుర్తింపు ఉంది. 1972లో మొదటిసారి 200 మంది ఎగ్జిబిటర్లతో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. ప్రస్తుతం ‘నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌’ ఏటా న్యూఢిల్లీలోని బుక్‌ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఈ పుస్తక ప్రదర్శనకు ప్రపంచంలోనే అతి పెద్ద ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ బుక్‌ ఫెయిర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉండటం గమనార్హం. యూకే, అర్జెంటీనా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, టర్కీ వంటి పదుల సంఖ్యలో దేశాలు, వెయ్యికి పైగా పబ్లిషర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. 2026లో జనవరి 10 నుంచి 18 వరకు పుస్తక ప్రదర్శన జరగనుంది.

724105dc-2dce-4376-b8a2-f0c2f2c2ea99

Also Read :  రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ హవా.. ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే

హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన

తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రియుల కోసం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన డిసెంబర్ 19, 2025 నుండి డిసెంబర్ 29, 2025 వరకు 11 రోజుల పాటు తెలంగాణ కళాభారతి,ఎన్.టి.ఆర్. స్టేడియం (ఇందిరాపార్క్ వద్ద)లో జరగనుంది. ఈ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను (National Book Fair) ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు  సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదగా ప్రారంభమవుతుంది.300కుపైగా స్టాళ్లతో డిసెంబరు 29 దాకా రోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. కాగా ఈ 38వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి లోకకవి అందెశ్రీ పేరు పెట్టారు. - hyderabad book fair news today

18558800-afec-42c0-bc6b-c4dbf4871681

అద్భుత ప్రదర్శనగా నిలిచేలా...

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ గత 38 ఏళ్లుగా పుస్తకప్రదర్శన నిర్వహిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం ప్రచురణకర్తలకు, సందర్శకులకు సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ తన లక్ష్యసాధనలో ముందుకు పోతుంది. గత సంవత్సరం 350 కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేయగా 12 లక్షల మంది సందర్శకులు పాల్గొన్నారు. ఈ సారి అంతకు మించి వస్తారని ఆశీస్తున్నారు. బుక్‌ ఫెయిర్‌ నిర్వహణ, పుస్తకాల లభ్యత, అందుబాటులో లేని ధరలే కాకుండా పెరుగుతున్న నగర విస్తీర్ణం కూడా సందర్శకుల తాకిడికి కారణంగా చెప్పవచ్చు. సామాజిక, ఆధ్యాత్మిక, నాస్తిక, అభ్యుదయ, విప్లవ, కాల్పానిక, సినిమా, శృంగార, శాస్త్ర సాంకేతిక, వ్యక్తిత్వ వికాస, విజ్ఞాన, విద్యా సంబంధ, విభిన్న సాహిత్య సాంస్కృతిక మొదలగు అన్ని రకాల వివిధ భాషల పుస్తకాలు ఈ ప్రదర్వనలో లభిస్తుంటాయి.  

ae185f79-33b1-4cda-b89c-aa11eaab0d1e

పలువురి జ్ఞాపకార్థం

కాగా ఈసారి పుస్తక ప్రదర్శనలో పలువురు దివంగత కవులు, రచయితలను తలచుకునేందుకు వీలుగా ఆయా విభాగాలకు వారి పేర్లు పెట్టినట్లు బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్ తెలిపారు. ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేరు, పుస్తకావిష్కరణ వేదికకు కొంపెల్లి వెంకట్‌ గౌడ్, రచయితల స్టాళ్లకు సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు, మీడియా స్టాళ్లకు జర్నలిస్టు స్వేచ్ఛా వొటార్కర్ పేర్లు పెడుతున్నట్లు వివరించారు. ఈ ఏడాది నుంచి పరిమిత సంఖ్యలోనే రిమైండర్(సెకండ్ హ్యాండ్) పుస్తకాల స్టాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. 

7ba4970f-97a4-4076-b604-a813836234ac

బాలోత్సవ్‌

కాగా పుస్తక ప్రదర్శనలో ప్రతి రోజు రెండు నుండి ఐదు గంటల వరకు ‘బాలోత్సవం’ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. బాల బాలికలకు సాహిత్య సాంస్కృతిక రంగాలపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. విద్యార్థుల్లోని ఆసక్తిని గ్రహించి వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు బాలసాహితీవేత్తలు ఈ కార్యక్రమం ద్వారా కృషి చేస్తుంటారు. తదుపరి ఐదు నుంచి ఆరు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6 నుంచి 7 గంటల వరకు పుస్తక ప్రదర్శనకు విచ్చేసిన ప్రముఖులు పుస్తకాలతో, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌తో వారికి ఉన్న అనుబంధాన్ని సందర్శకులతో పంచుకునే కార్యక్రమం ఉంటుంది.

aed6456e-5c8c-4dbf-a4f5-d6866123ca0a

నచ్చిన పుస్తకంపై చర్చ

ప్రతిరోజు రాత్రి 7గంటల నుండి 9 గంటల వరకు ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, దర్శకులు, విమర్శకులు, గాయకులు, గ్రంథపాలకులు, చిత్రకారులు, సినీ, పత్రిక, ప్రచురణ రంగానికి చెందిన వారిని ఎంపిక చేసుకొని పుస్తకం వారిని ఏ విధంగా ప్రభావితం చేసింది, వారికి ఏ పుస్తకం ఎందుకు నచ్చింది – అనే అంశాలపై సందర్శకులతో పంచుకుంటారు. ఈ సంవత్సరం కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పుస్తకంతో వారికున్న స్నేహాన్ని సందర్శకులతో పంచుకుంటారు. 


మధుకర్‌ వైద్యుల
జర్నలిస్ట్‌, కవి

Advertisment
తాజా కథనాలు