/rtv/media/media_files/2025/12/11/zso1dovs_ok-sd-2025-12-11-22-01-39.jpg)
Hyderabad:హైదరాబాద్‌లోని ఓ పోలీస్ అవినీతిపరులపైకి సింగంలా దూసుకెళ్లాడు. డ్రగ్స్, స్మగ్లింగ్, దొపీడీల వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాడు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ డిపార్డ్మెంట్‌లో తనదైన ముద్రవేశాడు. గల్లీలో దోపిడి చేసి ఢిల్లీలో తలదాచుకున్నా వదలకుండా సింగంలా వేటాడి వెంటాడి పట్టుకుని సంకెళ్లు బంధించాడు. వ్యాపార వేత్తలు, ప్రముఖులే కాదు రాజకీయ నాయకుల ఆగడాలకు సైతం అడ్డుకట్ట వేస్తూ పోలీస్ పవరేంటో చూపించాడు. అవినీతికి దడపుట్టిస్తూ దూసుకోపోతున్న ఖాకీ బాస్.. ఇటీవల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని సైతం లెక్కచేయలేదు. మంత్రి కొడుకు హర్షా రెడ్డి భూముల కబ్జాపై కఠినంగా వ్యవహరించాడు. రూ. 300 కోట్ల భూమిని అప్పనంగా దోచుకుంటున్నట్లు పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసి రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేశాడు గచ్చిబౌలి CI హబీబుల్లా ఖాన్. అయితే అనూహ్యంగా హబీబుల్లా ఖాన్‌కు బదిలీ లెటర్ అందించడం హాట్ టాపిక్‌గా మారింది. రూల్ బుక్ పట్టుకుని, నిష్పక్షపాతంగా వ్యవహరించిన గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చిందనే విమర్శలు మొదలయ్యాయి.
వివాదాస్పద బదిలీ కారణమేంటి?
ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్షా రెడ్డికి సంబంధించిన రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీ.. గండిపేట రెవెన్యూ పరిధి వట్టినాగులపల్లిలో రూ.300 కోట్ల విలువైన భూమి కబ్జాకు ప్రయత్నించింది. నవంబర్ 30న 70 మంది బౌన్సర్లను తీసుకెళ్లి ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేసి, స్థల యజమానిపై దాడి చేసినట్లు పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో గచ్చిబౌలి CI హబీబుల్లా ఖాన్ 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ఫైల్ అయిన కొద్ది రోజులకే CI హబీబుల్లా ఖాన్‌కు బదిలీ ఆదేశాలు రావడం రాష్ట్రంలో, పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విధులను సక్రమంగా నిర్వర్తించే పోలీస్ అధికారులు సైతం శిక్షల పాలవుతున్నారని, ఇలాగైతే బాధితులు ఎలా న్యాయం పొందాలనే ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
మంత్రిని సంతృప్తిపరిచేందుకే..
CI హబీబుల్లా ఖాన్‌పై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించలేదట. కానీ మంత్రిని సంతృప్తిపరిచేందుకు పొలిటికల్ బాసులు ఉత్తర్వులు జారీ చేయించినట్టు తెలుస్తోంది. సీఐని బదిలీ చేయించింది మంత్రి ఒత్తిడితోనే అయినప్పటికీ బాధితుల ఫిర్యాదుపై సకాలంలో స్పందించనందుకే బదిలీ చేసినట్టు పోలీసు వర్గాలు చెప్పడం హాస్యాస్పందం. బాధితుడి ఫిర్యాదుపై సీఐ నిజంగానే సరిగా స్పందించకపోతే అసలు ఈ వ్యవహారమే వెలుగులోకి వచ్చేది కాదని, కేవలం పొంగులేటి కక్ష సాధింపు వల్లే సీఐ బదిలీ జరిగిందని అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
రియల్ హీరో హబీబుల్లా ఖాన్..
CI హబీబుల్లా ఖాన్ మొదట హైదరాబాద్ ఓల్డ్ సిటీ కలపత్తార్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసారు. తర్వాత ప్రమోషన్ ద్వారా కాచిగూడ SHO డిపార్ట్మెంట్ లో CI గా విధులు నిర్వర్తించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించేటప్పుడు 85 ఇయర్స్ ఓల్డ్ లేడీ మర్డర్ కేసును కేవలం 48 గంటల్లోనే ఛేధించి, హంతకులని పట్టుకోవడంతో ప్రజల్లో నిజమైన హీరోగా మన్ననలు పొందారు. అంతేకాదు ఇటీవలే శిఖా గోయల్ నుంచి లా అండ్ ఆర్డర్ విభాగంలో 'సురక్షిత్ హైదరాబాద్' అవార్డును అందుకున్న హబీబుల్లా ఖాన్.. సైబరాబాద్ కమిషనరేట్‌లో క్రమశిక్షణ, నిజాయితీకి ప్రతీకగా నిలిచారు. ఏ ఒత్తిడి వచ్చినా, ఎలాంటి ప్రభావం ఉన్నా, చట్టపరమైన విధులే ప్రాధాన్యమని నమ్మే పోలీస్ ఆఫీసర్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
కీలక కేసులను ఛేదించి..
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు నిర్వహించిన కాలంలో CI హబీబుల్లా ఖాన్ పలు కీలక కేసులను ఛేదించారు. బడా బాబుల ఒత్తిడిని పట్టించుకోకుండా పలు భూకబ్జా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ క్యాబ్ & ఫ్రాడ్ రాకెట్లు, IT కారిడార్‌లో క్యాబ్, రిక్రూట్మెంట్, ఆన్‌లైన్ ఫ్రాడ్ గ్యాంగ్‌లకు అడ్డుకట్ట వేశారు. డ్రగ్స్ నియంత్రణ, డ్రగ్ నెట్‌వర్క్‌లపై దాడులు, సరఫరాదారులను భారీ సంఖ్యలో అరెస్టు చేశారు. ఇక బైక్ లిఫ్టింగ్, ల్యాప్‌టాప్ చోరీలు, కార్పొరేట్ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలను వేగంగా ఛేదించారు. IT ఉద్యోగుల భద్రత కోసం ప్రత్యేక అవేర్‌నెస్ డ్రైవ్స్, సైబర్ క్రైమ్ సమన్వయం చేశారు. ఈ నేపథ్యంలో పలు అవార్డులతోపాటు అధికారిక ప్రశంసలు అందుకున్నారు. అత్యుత్తమ క్రమశిక్షణకు గుర్తింపుగా సైబరాబాద్ మేరియట్ అవార్డు, కీలక కేసుల వేగవంత దర్యాప్తు, సిబ్బంది సమన్వయంలో ప్రతిభ చూపించి కమిషనర్ ప్రశంసలు దక్కించుకున్నారు.
Follow Us