/rtv/media/media_files/2025/12/11/fotojet-2025-12-11t125824075-2025-12-11-12-59-00.jpg)
Big twist in the honor killing case
Crime News: యువతిని ప్రేమించినందుకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తెను ప్రేమించాడని ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివను ఆమె తల్లి బ్యాటుతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం, సృజన్ లక్ష్మీ నగర్‌లో డిసెంబర్ 8 రాత్రి ఈ హత్య జరిగింది. కాగా బీటెక్ స్టూడెంట్ శ్రవణ్ సాయి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో బీటెక్ విద్యార్థి పరువు హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ప్రేమ వ్యవహారమే అతని హత్యకు ప్రాథమికంగా నిర్థారణ అయింది. మృతుడు శ్రవణ్ సాయి (19)ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లా నందిగామకు చెందినవాడు. హైదరాబాద్ శివారు మైసమ్మ గూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న అతను.. కొన్నాళ్లుగా తన టెన్త్ క్లాస్ మేట్ శ్రీజతో ప్రేమలో ఉన్నాడు.
కొంతకాలంగా శ్రీజ, శ్రవణ్‌సాయి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. విషయం తెలిసి గతంలోనే ఇద్దరికి శ్రీజ ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఐతే ఇద్దరిలో మార్పు రాకపోవడంతో శ్రవణ్‌సాయిపై దాడికి ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం శ్రవణ్ సాయిని శ్రీజతో కాల్‌చేయించి ఇంటికి పిలిచిన శ్రీజ తల్లి సిరి ప్రేమ విషయమై శ్రవణ్ సాయితో ఘర్షణకు దిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కోపంతో రెచ్చిపోయిన సిరి ఇంట్లో ఉన్న బ్యాట్‌తో శ్రవణ్‌సాయిపై దాడి చేసింది. కాగా శ్రవణ్ పై దాడితో కూతురు శ్రీజ అడ్డు రావడంతో ఆమెపై కూడా బ్యాట్‌తో దాడి చేసింది సిరి.ఈ దాడిలో శ్రీజ చేయి విరగగా శ్రవణ్ సాయి తల, వీపు భాగంలో బలమైన గాయాలయ్యాయి.గాయాలతో వెంటనే శ్రవణ్ సాయి స్పృహ కోల్పోయాడు. శ్రవణ్‌సాయిని అక్కడే వదిలేసి గాయలైన శ్రీజను శ్రీజ తల్లి సోదరుడు హాస్పిటల్‌కు తరలించారు. ఆ రాత్రి వారు ఆసుపత్రిలోనే చికిత్స చేయించారు. ఉదయం ఇంటికి వచ్చి చూడగా అప్పటికి శ్రవణ్‌సాయి అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. దీంతో అతన్నినిజాంపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. శ్రవణ్‌ను పరీక్షించిన డాక్టర్లు అతను చనిపోయాడని నిర్ధారించారు.
కాగా ఈ విషయంలో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జ్యోతి శ్రవణ్ సాయి చిన్నతనంలోనే అతడి తల్లిదండ్రులు చనిపోయారు. పెదనాన్న కాకాని వెంకటేశ్వరరావు ఇతడి బాగోగులు చూసుకుంటున్నారు. శ్రీజ తల్లి సిరి కుటుంబ గొడవల నేపథ్యంలో భర్తను వదిలేసి పిల్లలతో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సిరి హరిప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. హరిప్రసాద్ ఆధ్వర్యంలోనే శ్రవణ్ హత్య జరిగిందని వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. శ్రవణ్ ఒంటి మీద చాలా గాయాలున్నాయని.. రాత్రంతా హింసించారని.. తలపై బ్యాట్ బలంగా తగలడంతో శ్రవణ్ చనిపోయాడని ఆయన అంటున్నారు. ఈ హత్య హైదరాబాద్‌లోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
అయితే ఇక్కడ మరోక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఒకరోజంతా శ్రవణ్, శ్రీజలు ఇంటినుంచి వెళ్లిపోయి రాత్రంతా గండి మైసమ్మ సమీపంలోని ఒక పార్కులో గడిపినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో వారిద్దరి మధ్య సె***క్స్ జరిగిందని, తద్వారా శ్రీజ ప్రెగ్నెంట్ అయిందన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో సిరి ఒకసారి శ్రవణ్‌కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే శ్రీజ తను శ్రవణ్ ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతోనే శ్రవణ్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై శ్రీజ తల్లి, నిందితురాలు RTVతో మాట్లాడింది. శ్రవణ్‌ను నేను చూడడం రెండోసారి మాత్రమే అన్న సిరి. శ్రవణ్‌ను తనే ఇంటకి పిలిపించానని ఒప్పుకుంది.ఫస్ట్ టైం శ్రవణ్ 7 నెలల క్రితం పాప కాలేజ్ దగ్గరకు వచ్చాడని తెలిపింది.ఆ రోజు నా కూతురు తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు ఇంటికి రాలేదని, దాంతో నేను మాదాపూర్ పీఎస్‌కు వెళ్లి పాప మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చానని వెల్లడించింది. తర్వాత శ్రవణ్ పెద్దనాన్నను పిలిచి వార్నింగ్ ఇచ్చామని తెలిపింది. వాడు ఎంతసేపు నేను పెద్ద క్యాస్ట్ అని వాడు అన్నాడు, వాడి క్యాస్ట్‌తో నాకేం సంబంధం -అంటూ సిరి ప్రశ్నించింది. డబ్బుంటే వాడి దగ్గరే పెట్టుకోమను, నాకెమివ్వరు కదా అన్న - సిరి. తన కూతురుతో వాడు కలవకుండా ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని నిలదీసింది. గండి మైసమ్మ దగ్గర పార్కులో సె***క్స్ చేస్తారా అంటూ ప్రశ్నించింది. రాత్రి 11 గంటలు దాటినా కూడా గల్లీల్లో నా కూతురుతో కలిసి తిరిగేవాడని, ప్రాబ్లమ్ నా కూతురు కాబట్టే నా కూతురుని కూడా కొట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే శ్రవణ్ హత్యలో కేవలం సిరి మాత్రమే కాకుండా ఆమె ప్రియుడు హరిప్రసాద్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఒక పథకం ప్రకారమే శ్రవణ్‌ను ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ఘటనను బట్టి స్పష్టమవుతోందని పోలీసులు అంటున్నారు.
Follow Us