/rtv/media/media_files/2025/12/12/fotojet-2025-12-12t090452966-2025-12-12-09-05-15.jpg)
Duvvada Madhuri Srinivas
Duvvada Madhuri Srinivas : ఎపుడు వార్తల్లో ఉండే దువ్వాడ జంట మరోసారి సంచలనం సృష్టించారు. హైదరాబాద్ నగర శివారులోని ఒక ఫౌమ్ హౌజ్ లో బర్త్ డే పార్టీ చేసుకుంటూ ఈ జంట బుక్కైంది. పార్టీలో భారీగా మద్యం బాటిళ్లు , హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ(Jbiet) ఎదురుగా ఉన్న ద పెండెంట్ ఫామ్‌హౌస్‌పై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి బర్త్‌డే వేడుక చేసినట్లు గుర్తించారు. ఇందులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బర్త్‌డే పార్టీకి 29 మంది వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పార్టీలో 7 మద్యం బాటిళ్లు, హుక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వేడుకకు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో పాటు పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. అయితే ఈ బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అడ్డకున్నారు. జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్ డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్క బాటిళ్లను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us