/rtv/media/media_files/2025/12/14/11-killed-in-australian-shooting-targeting-jewish-community-2025-12-14-18-39-47.jpg)
11 killed in Australian shooting targeting Jewish community
ఆస్ట్రేలియా(australia) లోని సిడ్నీ(Sidney) లో బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్‌మెన్లు బీజ్‌లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు. దీంతో అక్కడుకున్న పర్యాటుకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులతో ఇద్దరు వ్యక్తులు పాదచారుల వంతెనపైకి వచ్చి కాల్పులు జరిపినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కాల్పులు జరిపిన వారు తండ్రీ కొడుకులని గుర్తించారు. తండ్రి పేరు సాజిద్ అక్రమ్. ఆయనకు 50 ఏళ్లు. కొడుకు నవీద్ అక్రమ్‌కు 24 ఏళ్లని తెలిసింది. వీరిద్దరూ పాకిస్తాన్ ఉగ్రవాదులని కూడా గుర్తించారు.
ఇప్పటికీ హైదరాబాద్ పాస్ పోర్టే..
ఇప్పుడు ఈ దాడికి సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. ఇతను హైదరాబాద్ నుంచి పాస్ పోర్ట్ పొందినట్లు తెలంగాణ డీజీపీ కార్యాలయం ప్రకటించింది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వ్యక్తి అని తెలిపింది. ఇతను 27 ఏళ్ళ క్రితం 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళాడు. తర్వాత అక్కడే యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, కుమార్తె ఉన్నారు. ఇద్దరూ ఆస్ట్రేలియా పౌరులే. అయితే సాజిద్ అక్రమ్ మాత్రం ఇప్పటికీ భారత పాస్ పోర్ట్ నే ఉపయోగిస్తున్నాడని తెలుస్తోంది. 1998లో అక్కడకు వెళ్ళాక సాజిద్ ఇప్పటి వరకు ఆరుసార్లు ఇండియాకు వచ్చాడు. హైదరాబాద్ లో ఇప్పటికీ అతనికి కొన్ని కాంటాక్టస్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పుడు సాజిద్ కు ఎలాంటి నేర చరిత్రా లేదు. ఉగ్రవాదులతో అతనికి ఉన్న సంబంధాలపై తమకేమీ తెలియదని కూడా హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
సిడ్నీలోని బోండీ బీచ్ లో సాజిద్, అతని కూమారుడు నవీద్ లు విచరక్షణా రహితంగా కాల్పులు జరిపారు. యూదుల హనుక్కా ఉత్సవంలో వీరు చర్యకు పాల్పడ్డారు. అయితే కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఎదురు కాల్పులు జరిపారు. దీంట్లో సాజిద్ అక్కడే మరణించగా...నవీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.కాల్పులకు పాల్పడ్డ 50 ఏళ్ళ సాజిద్ తుపాకీ హోల్టర్ అని గుర్తించారు. అతడి పేరు మీద ఆరు తుపాకులు నమోదు చేశారని.. ఈ నేరాలకు కూడా అవే ఆరు తుపాకులను ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
Follow Us