GOAT HYD TOUR: మెస్సీ మయం అయిన ఉప్పల్ స్టేడియం..గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి

కొలకత్తాలో చెత్త చెత్త అయిన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ టూర్ హైదరాబాద్ లో మాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు అంతా హ్యాపీగా జరిగింది.  ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సీఎం రేవంత్ ఒక గోల్ కొట్టి అలరించారు.

New Update
messi, hyd

హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో హై వోల్టేజ్ ఫ్రెండ్లీ ఫుట్ మ్యాచ్ అద్భుతంగా జరిగింది. గోట్‌ కప్‌ పేరుతో ఉప్పల్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. సింగరేణి ఆర్‌ఆర్‌, అపర్ణ మెస్సి జట్ల మధ్య మ్యాచ్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో 18వ నిమిషంలో గ్రౌండ్ లోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చీ రాగానే గోల్ కొట్టారు. దీంతో స్టేడియం అంతా చప్పట్లతో దద్దరిల్లింది. ఆ తరువాత మెస్సీ గ్రౌండ్ లోకి దిగి కాసేపు సీఎం రేవంత్ తో  గేమ్ ఆడారు. ఈ క్రమంలో మెస్సీ రెండు గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత ప్లేయర్స్‎తో కలిసి ఫొటో దిగారు. ఫైనల్ గా మెస్సీ అభిమానుల కోసం స్టాండ్స్ లోకి బాల్స్ ను కిక్ చేశాడు. సింగరేణి ఆర్‌ఆర్‌ టీమ్‌ తరఫున రేవంత్ రెడ్డి ఆడారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి మెస్సి, రేవంత్‌ ఫొటోలు దిగారు. ఈ మ్యాచ్ చూడ్డానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకగాంధీ కుమారుడు, కుమార్తె ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను వీక్షించారు. 

Also Read :  తప్పయింది క్షమించండి: మమతా బెనర్జీ

Also Read :  కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిళ్లు విసురుతూ రచ్చ!

ఆసక్తికరంగా ఫ్రెండ్లీ మ్యాచ్..

ఉప్పల్ స్టేడియంలో హై వోల్టేజ్ మ్యాచ్ ఇంకా కొనసాగుతోంది. జెర్సీ నంబర్ 10తో మెస్సీ మ్యాచ్ ఆడగా...మరోవైపు సీఎం రేవంత్, రాహుల్ గాంధీలు మ్యాచ్ ఆడారు. ఫ్రెండ్లీ మ్యాచ్ అయినప్పటికీ మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఉప్పల్ స్టేడియం అంతా మెస్సీ అభిమానులతో నిండిపోయింది. స్టాండ్స్ అన్నీ మెస్సీ జెర్సీ మయం అయిపోయాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో సింగరేణి ఆర్‌ఆర్‌ 9 టీమ్ (సీఎం జట్టు) విజేతగా నిలిచింది. విజేతగా నిలిచిన సింగరేణి ఆర్‌ఆర్‌ 9 టీమ్‌కు ట్రోఫీని లియోనెల్ మెస్సీ స్వయంగా అందజేశారు.మ్యాచ్ అనంతరం మెస్సీ, రోడ్రిగో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. అలాగే ముందుగానే ఎంపిక చేసిన తెలంగాణ జిల్లాల్లోని గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కూడిన నాలుగు జూనియర్ టీమ్స్‌తో మెస్సీ మాట్లడ్డమే కాక వారికి ఫుట్‌బాల్ మెళకువలు, టిప్స్‌ను అందించారు. 

Advertisment
తాజా కథనాలు