Hyderabad: ఆమెకు వర్క్‌ఫ్రం హోం..ఆయనకు నో టైం.. పెళ్లయిన నాలుగు నెలలకే..

వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. ఇద్దరూ జాబ్‌ చేస్తున్నారు. ఆమె వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా, అతను మాత్రం రోజు ఉదయం వెళ్తే రాత్రికి గాని రాలేని పరిస్థితి. దీంతో పెళ్లయి 4నెలలు గడుస్తున్నా ఇద్దరి మధ్య అన్యోన్యత కరువైంది. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది.

New Update
FotoJet

Suicide just four months after marriage

Hyderabad: వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. ఇద్దరూ జాబ్‌ చేస్తున్నారు. అయితే ఆమె వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా, అతను మాత్రం రోజు ఉదయం వెళ్తే రాత్రికి గాని రాలేని పరిస్థితి. దీంతో పెళ్లయి నాలుగు నెలలు గడుస్తున్నా ఇద్దరి మధ్య అన్యోన్యత కరువైంది. తనకు సమయం కేటాయించడం లేదని వాపోయింది. అతను మాత్రం పనిచేసుకోకపోతే ఎలా? అంటూ సముదాయించే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది.

యవతి బంధువులు, కూకట్‌పల్లి ఎస్సై గిరీష్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. ఏపీలోని వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చందనాజ్యోతి(25)కు కొత్తగూడెం నివాసి బి.వెంకటసాయి యశ్వంత్‌తో ఈ ఏడాది ఆగస్టు 14న వివాహం జరిగింది. ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ మూసాపేట పరిధిలోని ఆంజనేయనగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా చందనాజ్యోతిది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం..ఆమె ‘వర్క్‌ఫ్రం హోం’ చేస్తున్నారు. యశ్వంత్‌ స్థానిక మెడ్‌ప్లస్‌ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అయితే కొత్తగా పెళ్లయినప్పటికీ తనకు భర్త సమయం కేటాయించడం లేదని చందనజ్యోతి తీవ్ర మనస్తాపం చెందింది.

భర్త జాబుకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాకపోవడం, అసలే కొత్తగా పెళ్లయి.. ఇంట్లోనే వర్క్‌ చేస్తూ ఒంటరిగా ఉంటుండటం తో ఆమె మానసిక వేదనకు లోనైంది. ఇదే విషయంపై భర్తతో రెండు మూడు రోజులుగా ఆమె గొడవపడుతున్నారు. శుక్రవారం దంపతుల మధ్య మరోసారి గొడవ జరిగింది.  కోపంతో ఇద్దరూ చెరో గదిలో  నిద్రపోయారు. అయితే శనివారం తెల్లవారుజామున యశ్వంత్‌ ఎంత పిలిచినా చందనాజ్యోతి స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి  గది తలుపులు పగలకొట్టి చూడగా.. అప్పటికే బెడ్‌షీట్‌తో చందన ఉరేసుకుని కన్పించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

Advertisment
తాజా కథనాలు