తెలంగాణలో కలకలం రేపుతున్న పరువు హత్య.. గొడ్డలితో నరికి అతి కిరాతకంగా!
తెలంగాణలోని పెద్దపల్లిలో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ తండ్రి యువకుడిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.