Aleti Maheshwar Reddy: సీఎం రేవంత్, భట్టికి మధ్య విభేదాలు.. ఇదిగో ప్రూఫ్.. ఏలేటి సంచలనం!

రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటిస్తే.. ఆర్థిక మంత్రి భట్టి దీనిపై ఎందుకు స్పందించడం లేదని BJLP నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. రేవంత్ ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ను మిగతా మంత్రులు వ్యతిరేకిస్తున్నారన్నారు.

New Update
Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

మంత్రి వర్గ విస్తరణను అడ్డుకుంటున్న సూత్రధారి, కుట్రదారుడు రేవంత్ రెడ్డి అని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని సీఎం ప్రకటిస్తే.. ఆర్థిక మంత్రి భట్టి దీనిపై ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్, భట్టికి మధ్య విభేదాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యోగుల విషయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వర్గంలో విబేధాలు వచ్చాయన్నారు. మంత్రులు సీఎంకు మద్దతుగా లేరన్నారు. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని పెట్టి సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిల ఎగ్గొట్టేందుకు చూస్తున్నారని మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఆర్థిక ఎమర్జెన్సీ స్టేట్మెంట్ ను మిగతా మంత్రులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మంత్రి మండలి రెండుగా చీలిందంటూ చెప్పుకొచ్చారు. 

సీఎం, హైకమాండ్ కు గ్యాప్ కంటిన్యూ అవుతోందన్నారు. అందుకే మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినా.. రేవంత్ ను పలకరించలేదన్నారు. రేవంత్ వ్యాఖ్యలు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారన్నారు. ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ పెట్టాలనే ఆలోచనతోనే చీఫ్ సెక్రటరీ గా రామకృష్ణారావును నియమించారన్నారు. సీఎం రేవంత్ కనీసం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. రివ్యూస్ అన్నీ సీఎం నివాసంలో పెట్టడంతో సీనియర్ మంత్రులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొన్ని శాఖల్లో సీఎం జోక్యం చేసుకోవడం మంత్రులకు నచ్చడం లేదన్నారు.

Also Read :  జియో మామ బిగ్గెస్ట్ ఆఫర్.. తక్కువ ధరకే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!

Also Read :  ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ

సీఎం, రెవెన్యూ మినిస్టర్ కు గ్యాప్..

భూముల వ్యవహారంలో సీఎం, రెవెన్యూ మినిస్టర్ కు గ్యాప్ పెరిగిందని స్పష్టం అవుతోందన్నారు. మంత్రి వర్గంలో అనుకూలం కంటే వ్యతిరేక మంత్రులే ఎక్కువ అని రేవంత్ రేవంత్ భావిస్తున్నాడన్నారు. అందుకే మంత్రి వర్గ విస్తరణను రేవంత్ ఆపుతున్నాడన్నారు. మంత్రివర్గ విస్తరణ రేవంత్ కు ఇష్టం లేదన్నారు. తనకు అనుకూలమైన వారికి మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ లేదని రేవంత్ కు తెలుసన్నారు. 

తన దగ్గరున్న ముఖ్యమైన శాఖలు కొత్త వారికి వెళ్తే.. ఆ శాఖలపై పట్టు పోతుందనే భయం సీఎంకు ఉందన్నారు. బీసీలకు దేవాదాయ, రవాణా లాంటి పనికి రాని శాఖలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సీఎం మీద వస్తోన్న అనేక ఆరోపణల ఫైల్ రాహుల్ దగ్గర ఉందన్నారు. ఢిల్లీ పరిస్థితులు సీఎంకు అర్థమయ్యాయని.. అందుకే సహచర మంత్రులను సీఎం అని మాట్లాడుతున్నాడని తనదైన శైలిలో సెటైర్లు వేశారు మహేశ్వరరెడ్డి. 

Also Read :  కరీంనగర్‌లో కలకలం.. పెళ్లికి ముందే కోటి కట్నం.. మరో అమ్మాయితో వరుడు జంప్!

Also Read :  ఓటీటీలోకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.. ఇప్పుడు ఆ కండీషన్ లేదు!

(bjlp | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు