/rtv/media/media_files/2024/12/02/JwQIwbYLavMcIU3Egati.jpg)
Adilabad k8 Tiger died of electric shock
Tiger died: కరెంట్ షాక్‌తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. పెంచికల్‌పేట్ మండలం ఆగర్‌గూడ గ్రామ సమీపంలోని పాత చిచ్చాల అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అయితే పులి చనిపోయిన తర్వాత దాదాపు 200 మీటర్ల వరకు మోసుకెళ్లిన స్మగ్లర్లు.. చర్మం, గోళ్లను తీసుకొని మిగిలిన కళేబరాన్ని ఒర్రెలో పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు CCF శాంతారాం, DFO నీరజ్‌కుమార్ చెప్పారు.
పట్టించుకోని విద్యుత్ అధికారులు..
ఇక మే 13న పులి కెమెరాలకు చిక్కింది. ఆగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఉన్న కరెంట్ లైన్ తొలగించాలని అధికారులకు సూచించాం. అయినా వారు పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మే 15న ఉదయం సమీప గ్రామాల ప్రజలు తునికాకు సేకరణకు వెళ్లగా పులిని చూసి భయపడి వెనక్కు వచ్చేశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మే 16న గాలిస్తుండగా రక్తపు మరకలు, వెంట్రుకలు కనిపించాయి. వీటి ఆధారంగా పాతిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం అని నీరజ్‌కుమార్ వివరించారు.
ఇది కూడా చదవండి: చియా సీడ్స్ రోజూ తింటున్నారా..? నెల రోజుల్లో మీ శరీరంలో జరిగేది ఇదే..!
K8గా పిలవబడే పులి 2021లో (K-11, 12, 13) మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే 2 నెలల నుంచి బెజ్జూరు అటవీ ప్రాంతంలోని మత్తడి వద్దే సంచరిస్తున్నట్లు చెప్పారు. ఈ పులి ఉనికి మత్తడి నీటి ఊటల వద్దే ఉంటుందన్నారు. కానీ ఇటీవల దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించి ఆగర్‌గూడ పాత చిచ్చాలకు వచ్చిన పులిని స్మగ్లర్లు కరెంట్ షాక్ పెట్టి చంపినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: సరదాగా తీసుకునే స్నాక్స్‌తో ఆనారోగ్యం.. అధిక రక్తపోటుకు కారణాలు ఇవే