Telangana: అంగన్వాడీలకు సీఎం రేవంత్ బంపర్ గుడ్ న్యూస్.. నెల రోజుల పాటు

రాష్ట్రప్రభుత్వం తెలంగాణ అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. మంత్రి సీతక్క చొరవతో సెలవులు ప్రకటించారు. ఎండల తీవ్రత వల్ల మే1 నుంచి నెలరోజుల పాటు అంగన్వాడీలకు సెల‌వులు ఇవ్వనున్నారు. తల్లిదండ్రులు, అంగ‌న్వాడీ యూనియ‌న్ల విజ్ఞప్తి మేర‌కు ఈనిర్ణయం తీసుకున్నారు.

New Update
telangana anganwadi (1)

telangana anganwadi

తెలంగాణలో అంగన్వాడీలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు సెలవులు ప్రకటించింది. మంత్రి సీతక్క ఆదేశాలతో అంగన్వాడీ చిన్నారులకు దాదాపు నెల రోజుల పాటు హాలీడేస్ ప్రకటించారు. వేసవి కాలం కావడంతో ఎండలు భగభగ మండిపోవడంతో అంగ‌న్వాడీ యూనియ‌న్లు, తల్లిదండ్రులు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెలవులు ప్రకటించింది. 

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

మే 1 నుంచి సెలవులు

దీంతో మే 1వ తేదీ అంటే రేపటి నుంచి నెల రోజుల పాటు అంగన్వాడీలకు సెల‌వులు ఇవ్వనున్నారు. అదే సమయంలో అంగ‌న్వాడీ ల‌బ్దిదారుల‌కు పౌష్టికాహారం అందించేందుకు స్పెషల్‌గా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అంగ‌న్వాడీ చిన్నారుల‌కు, గ‌ర్భిణుల‌కు, బాలింత‌ల‌కు టేక్ హోం రేష‌న్ ద్వారా గుడ్లు, స‌రకుల‌ స‌ర‌ఫ‌రా చేయాలని వారు ఆదేశాలు జారీ చేసారు. 

Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే సాధారణంగా అంగ‌న్వాడీలకు వేసవి సెలవులు ఉండవు. కానీ వారికి ఇప్పుడు సెలవులు ప్రకటించడంతో అంగ‌న్వాడీ యూనియ‌న్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీత‌క్క చొర‌వతో తమకు సెలవులు వచ్చాయని వారు ఫుల్ ఖుష్ అవుతున్నారు. చరిత్రలో తొలిసారి తమకు సెలవులు ప్రకటించారని సిబ్బంది చెబుతున్నారు. 

Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!

కాగా ఈ వేసవి సెలవుల్లో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు కేటాయించినట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను డైరెక్టర్ కాంతి వెస్లీ తాజా సమావేశంలో ఆదేశించారు. ఈ మేరకు ఇంటింటి సర్వే చేయాలని.. అదే సమయంలో అంగన్వాడీలో చేర్చే చిన్నారులను గుర్తించే విధులను నిర్వర్తించాలని టీచర్లను ఆయన ఆదేశించారు. 

Also Read :  ఆ సమస్యలను పరిష్కరించండి...కేంద్ర మంత్రితో ఎంపీ సానా సతీష్ బాబు భేటీ!

anganwadi | Anganwadi teachers | anganwadi-workers | latest-telugu-news | telugu-news

Advertisment
తాజా కథనాలు