/rtv/media/media_files/2025/05/04/0lgyD20h6VR58pmjD0Qg.jpg)
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకున్న ఓ వలస కూలీ బతుకు గురించి గోట్ లైఫ్ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమా తర్వాత చాలామంది తాము కూడా అలాంటి జీవితాన్ని గడిపామని బయటకు వచ్చారు. ప్రభుత్వాలు కూడా విదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులను పట్టించుకోవడం ప్రారంభించింది. తాజాగా మరో వలస కూలీ రెడ్డి నాయక్ కన్నీటి కథ వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా పెంబి మండలానికి చెందిన రెడ్డి నాయక్ బతుకు దెరువు కోసం మలేసియా వెళ్లాడు. కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్లిన రెడ్డి నాయక్‌ని మోసం చేయడంతో మలేషియాలోనే కూలి పని చేసుకుంటున్నాడు. సొంత దేశానికి రాలేక.. బిక్కుబిక్కు మంటూ అక్కడే కూలీనాలి చేసుకుంటూ బతుకుతున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు.
🔷 రోడ్డు ప్రమాదంలో మరణించిన బంజారా విద్యార్థినుల కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ
— Mission Telangana (@MissionTG) May 3, 2025
🔷 మలేషియాలో చిక్కుకున్న విద్యార్ధినుల తండ్రికి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు 👇
🔹నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం లోతేర తండాకు చెందిన అక్కచెల్లెలు బాణావత్ మంజుల మరియు బాణావత్… pic.twitter.com/TKOydaUceO
ఇటీవల హైదరాబాద్‌లో పరీక్ష రాసి వస్తుండగా అక్కా, చెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారు కల్వర్టును ఢీ కొనడంతో మంజుల, అశ్వినీలు అక్కడికక్కడే చనిపోయారు. ఈ వార్త విన్న తండ్రి రెడ్డి నాయక్ గుండె ముక్కలైంది. కూతుళ్ల కడసారి చూపు నోచుకోలేనని కన్నీటితో అతని హృదయం ద్రవించిపోయింది. కన్న బిడ్డలకు అంత్యక్రియలు చేయడానికి ఇండియాకు వచ్చే ఆర్థిక స్థోమత లేదని రెడ్డి నాయక్ కుమిలిపోతున్నాడు. బంధువులు విషయాన్ని బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ టీం దృష్టికి తీసుకెళ్లారు. రెడ్డి నాయక్‌ని మలేషియా నుంచి ఇండియా రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
(Reddy Nayak | nirmal | malaysia | KTR team | Immigrants | latest-telugu-news)