కొండంతరాగం తీసి.. కేసీఆర్ సభపై ఏలేటి పంచ్ లు (VIDEO)

నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొండంతరాగం తీసి.. దిక్కుమాలిన పాట పాడినట్లు ఉందని BJLP నేత మహేశ్వరరెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని విమర్శించారు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంస పాలన.. ఫెయిల్యూర్ పాలన అని నిప్పులు చెరిగారు.

New Update

తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి ఆరోపించారు. నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొండంతరాగం తీసి.. దిక్కుమాలిన పాట పాడినట్లు ఉందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదంటున్న కేసీఆర్.. బీబీ నగర్ లో AIMS ఎవరిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

కేసీఆర్ ను ప్రజలు నమ్మరు..

కేసీఆర్ పదేళ్ల పాటు మావోయిస్టులను చర్చలకు ఎందుకు పిలవలేదో కూడా చెప్పాలన్నారు. అధికారం పోయాక కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తుకు వచ్చారన్నారు. మావోయిస్టుల కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదన్నారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంస పాలన.. ఫెయిల్యూర్ పాలన.. కుటుంబ పాలన అని నిప్పులు చెరిగారు. మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. 

(Alleti Maheshwar Reddy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు