Iran: వాట్సాప్‌ను డిలీట్ చేయండి.. ఇరాన్ సంచలన ప్రకటన
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.
తమ దేశంలో ఉండే ప్రజలు వెంటనే స్మార్ట్ఫోన్ల నుంచి వాట్సాప్‌ను తొలిగించాలని ఇరాన్ సూచనలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు పంపిస్తోందని తెలిపింది.
రేపటి (జూన్ 1) నుంచి పాత మోడల్ ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో ఈ యాప్ పని చేయదు. ఐఫోన్ 5S, 6, 6+,6S, ఐఫోన్ SE, అలాగే మోటో, శామ్సంగ్, LG కంపెనీలోని కొన్ని మోడల్స్ ఫోన్లో వాట్సాప్ సపోర్ట్ చేయదు.
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌లో రేషన్ కార్డులు సేవలు అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలను ఎంచుకోవాలనే ఆప్షన్ వస్తుంది. ఆ తర్వాత మీరు పౌర సేవలు, సివిల్ సప్లయిస్ సేవలపై క్లిక్ చేయాలి. అందులో మొత్తం 8 సేవలు కనిపిస్తాయి.
యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చేసిన ఆరోపణలను మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తోసిపుచ్చారు. కంపెనీలలో విలువను చూసి తాను వాటిని కొనుగొలు చేశానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎఫ్‌టీసీలో జుకర్ బర్గ్ విచారణ ముగిసింది.
వాట్సాప్ హ్యాకైతే వైఫైతో రీలాగిన్ అయితే అనాథరైజిడ్ లాగిన్స్ అన్నీ తొలగిపోతాయి. వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్, లేదా డేటా దుర్వినియోగానికి పాల్పడవచ్చు. అలా చేస్తే సిమ్ కార్డు కీప్యాడ్ ఫోన్లో వేసి ఆండ్రాయిడ్ ఫోన్లో లాగిన్ అవ్వండి.
కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ వల్ల మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. వాట్సాప్‌లో బగ్ గుర్తించామని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్ లు అప్లోడ్ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
వాట్సాప్ వీడియో కాల్‌కు ముందు వీడియో ఆపివేసే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాయిస్ కాల్ మ్యూట్ చేయడం వంటి రెండు కొత్త ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్ వాట్సాప్ వీడియో కాల్లో ఎమోజీలు షేరింగ్ కూడా రానుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 97లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. అందులో ఫిర్యాదులు రాకముందే దాదాపు 14లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని తొలగించింది.