WhatsApp Update: బిగ్ ఛేంజ్.. ఫేస్‌బుక్ తరహాలో కవర్‌ఫొటో

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ మాదిరిగా 'కవర్ ఫోటో' ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఇది వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు నార్మల్ యూజర్లకు ఇవ్వాలని చూస్తున్నారు.

New Update
WhatsApp cover page update

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) తన యూజర్ల కోసం మరో ఆసక్తికరమైన ఫీచర్‌(whatsapp-new-feature) ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మెటా యాజమాన్యంలో ఉన్న వాట్సాప్, ఇప్పుడు ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న మాదిరిగా 'కవర్ ఫోటో' ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ఈ సదుపాయం వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు సాధారణ వినియోగదారులందరికీ ఈ ఫీచర్ ఇవ్వాలని సంస్థ ప్రయత్నిస్తోంది.

Also Read :  వికీపీడియాకు పోటీగా ఎలాన్ మస్క్ కొత్త AI టూల్.. డిటైల్స్ ఇవే..!

WhatsApp Cover Page Update

ఈ కొత్త అప్‌డేట్ ద్వారా, యూజర్లు తమ ప్రొఫైల్ పిక్చర్‌తో పాటు, ప్రొఫైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద సైజులో కనిపించే కవర్ ఫోటోను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది యూజర్ల ప్రొఫైల్‌కు మరింత వ్యక్తిగత స్టైల్‌ను, ప్రత్యేకతను అందించనుంది. వాస్తవానికి, ఈ కవర్ ఫోటో ఫీచర్ మొదట వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్ కోసం అందుబాటులోకి వచ్చింది. వ్యాపారాలు తమ బ్రాండింగ్, కొత్త ఆఫర్లు లేదా ప్రాడక్టులకు ప్రముఖంగా చూపించుకోవడానికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇప్పుడు, వాట్సాప్ సాధారణ వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను విస్తరించాలని చూస్తోంది. ప్రొఫైల్ కస్టమైజేషన్‌ను మెరుగుపరిచే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ఈ కొత్త ఫీచర్‌తో పాటు, వాట్సాప్ ప్రత్యేకమైన గోప్యతా నియంత్రణలను కూడా ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా వినియోగదారులు తమ కవర్ ఫోటోను ఎవరు చూడాలనేది స్వయంగా నిర్ణయించుకోవచ్చు. ఈ కవర్ ఫోటో ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ అప్‌డేట్ వాట్సాప్ ప్రొఫైల్‌కు కొత్త టచ్, మరింత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది అనడంలో సందేహం లేదు.

Also Read :  ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు.. రూ.20 వేల తగ్గింపుతో భారీ డిస్కౌంట్లు

Advertisment
తాజా కథనాలు