/rtv/media/media_files/2025/12/07/cyber-security-2025-12-07-07-57-14.jpg)
Cyber Security
Cyber Security: భారత ప్రభుత్వం కొత్త సైబర్ సెక్యూరిటీ నియమాలు తీసుకురావడంతో, వాట్సాప్(Whatsapp), టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్ వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లు వాడే విధానంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. కొత్త నియమాల ప్రకారం, ఈ యాప్‌లు యూజర్లు యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా సేవలను ఉపయోగించలేరు.
ఈ ఆదేశాన్ని టెలికమ్యూనికేషన్ శాఖ (DoT) టెలికమ్యూనికేషన్ సైబర్‌సెక్యూరిటీ అమెండ్‌మెంట్ రూల్స్ 2025 లో భాగంగా విడుదల చేసింది. మొదటిసారిగా మెసేజింగ్ యాప్‌లను టెలికాం సేవల తరహాలో పర్యవేక్షించనున్నారు. యాప్‌లో లాగిన్ కోసం తప్పనిసరి సిమ్ కనెక్షన్.
కొత్త నిబంధనల ప్రకారం..
- యూజర్లు వాడుతున్న సిమ్ కార్డ్ 90 రోజులు నిరంతరం యాప్‌తో లింక్ అయి ఉండాలి
- సిమ్ డియాక్టివ్ అయితే లేదా తీసేస్తే యాప్ పనిచేయకూడదు
- వెబ్ బ్రౌజర్‌లో లాగిన్ అయ్యే యూజర్లను ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగ్ ఔట్ చేయాలి
- మళ్లీ లాగిన్ కావాలంటే QR కోడ్ ద్వారా రీ-వెరిఫికేషన్ చేయాలి
ప్రభుత్వం ప్రకారం, ఈ చర్యలతో నేరస్థులు దూర ప్రాంతాల నుంచి నకిలీ లాగిన్‌లు చేయడం కష్టమవుతుంది.
ఎందుకీ నియమాలు?
ప్రస్తుతం అనేక మెసేజింగ్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఒకసారి మాత్రమే మొబైల్ నంబర్‌ను వెరిఫై చేస్తాయి. తర్వాత సిమ్ తీసేసినా, డియాక్టివ్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. దీనిని సైబర్ నేరగాళ్లు సులభంగా ఉపయోగించుకుంటున్నారు.
Cellular Operators Association of India (COAI) ప్రకారం:
సిమ్-యూజర్-డివైస్ మధ్య సంబంధం లేకపోవడం వల్ల మోసగాళ్లను గుర్తించడం కష్టమవుతోంది. మెసేజింగ్ ద్వారా జరిగే మోసాలు, స్పామ్ కాల్స్, ఫైనాన్షియల్ స్కామ్‌లు పెరుగుతున్నాయి. నిరంతర సిమ్ లింకేజ్ ఉంటే యూజర్ ట్రేస్ చేయడం సులభమవుతుంది. ఇలాంటి కఠిన నిబంధనలు ఇప్పటికే బ్యాంకింగ్, యూపీఐ వంటి సర్వీసుల్లో ఉన్నాయి.
నిపుణులు ఏమంటున్నారు? ఈ నియమాలపై నిపుణుల అభిప్రాయం రెండు విధాలుగా ఉంది. కొంతమంది నిపుణులు సిమ్ లింకింగ్ వల్ల యూజర్‌ను సులభంగా గుర్తించవచ్చని. మోసాలు కొంతవరకు తగ్గవచ్చని అంటున్నారు. ఇంకొంతమంది నిపుణులు నేరగాళ్లు నకిలీ పత్రాలతో కొత్త సిమ్‌లు తీసుకోవడం వల్ల ఇది పెద్దగా ప్రయోజనం ఇవ్వదని ఈ నియమాలు యూజర్ ప్రైవసీకి చికాకు కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
యూజర్లపై ప్రభావం ఏమిటి?
సిమ్ యాక్టివ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు పని చేయవు. వెబ్ వెర్షన్‌లో తరచూ లాగిన్ చేయాల్సి వస్తుంది. సిమ్ మార్చినప్పుడు తిరిగి వెరిఫికేషన్ తప్పనిసరి అనగా, మిలియన్ల మంది యూజర్ల కోసం యాప్ వాడకం కొంత అసౌకర్యం కలిగించొచ్చు.
Follow Us