/rtv/media/media_files/2026/01/30/whatsapp-2026-01-30-18-41-16.jpg)
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు షాక్ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఫ్రీగా వాట్సాప్ ఎంజాయ్ చేస్తున్నవారు ఇంకా కొన్ని ఫీచర్లు(whatsapp-new-feature) కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అనే రూల్ తీసుకురానుంది. త్వరలోనే ఈ ప్లాట్‌ఫారమ్ 'ప్రీమియం సబ్‌స్క్రిప్షన్' ప్లాన్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు టెక్ వర్గాల సమాచారం. మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత వర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా ఈ కొత్త మోడల్‌ను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలు ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.4.8లో కనిపించినట్లు ప్రముఖ వెబ్‌సైట్ WABetaInfo వెల్లడించింది.
Also Read : ఇండియన్ ఆస్ట్రోనాట్.. శుభాన్షు శుక్లాకు అశోక చక్ర?
WhatsApp Paid Subscription Plan
> WhatsApp may offer subscriptions to avoid ads in Status and Channels
— Aditya Kumar (@instauseraditya) January 26, 2026
> But only in some countries where Meta already offers subscriptions for removing ads in Instagram and Facebook pic.twitter.com/SNUnLsGMOk
Also Read : యూట్యూబ్ AI వీడియోలు: రికార్డింగ్ అవసరం లేకుండా లేటెస్ట్ టెక్నాలజీ
ఈ పెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లను పొందవచ్చని సమాచారం. ప్రస్తుతం వాట్సాప్‌లో కేవలం మూడు చాట్‌లను మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారు మూడు కంటే ఎక్కువ ముఖ్యమైన చాట్‌లను పిన్ చేసుకునే వీలుంటుంది. వీటితో పాటు, కేవలం పెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్కర్లు, ఆకర్షణీయమైన యాప్ థీమ్స్, ప్రతి చాట్‌కు వేర్వేరు రింగ్‌టోన్‌లను సెట్ చేసుకునే ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, యాప్ ఐకాన్‌ను కూడా తమకు నచ్చిన విధంగా మార్చుకునే వెసులుబాటును వాట్సాప్ కల్పించనుంది.
అయితే, ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పూర్తిగా యూజర్ల ఇష్టం. సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ స్పష్టం చేస్తోంది. చాటింగ్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ వంటి ప్రైమరీ ఫీచర్లు ఎప్పటిలాగే ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అలాగే, వినియోగదారుల ప్రైవసీ, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం అదనపు ఫీచర్లు, మరింత మెరుగైన కొత్తదనాన్ని కోరుకునే వారు మాత్రమే ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు ఇలాంటి ప్రీమియం సేవలను అందిస్తుండటంతో, వాట్సాప్ కూడా అదే బాటలో పయనిస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. త్వరలోనే వెయిట్‌లిస్ట్ సిస్టమ్ ద్వారా వీటిని కొంతమందికి అందుబాటులోకి తెచ్చి, ఆపై అందరికీ విడుదల చేసే అవకాశం ఉంది. ధరల విషయానికి వస్తే, ఒక్కో దేశానికి ఒక్కో రకమైన ఛార్జీలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ మార్పులు వాట్సాప్ వాడే విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Follow Us