Arattai app: వాట్సాప్‌కు పోటీగా ఇండియా యాప్.. సేమ్ టూ సేమ్

అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో కూడా ఈ యాప్ ప్రాచుర్యంలో ఉంది. దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి ఓ స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్ 'అరట్టై' పేరుతో విడుదలైంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఈ కొత్త యాప్‌ను రూపొందించింది.

New Update
arrette

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌‌కు మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇన్‌స్టాంట్ మెసేజ్ ఫ్లాట్‌ఫాంలో వాట్సాప్ ముందుంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో కూడా ఈ యాప్ ప్రాచుర్యంలో ఉంది. దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి ఓ స్వదేశీ మెసేజింగ్ అప్లికేషన్ 'అరట్టై' పేరుతో విడుదలైంది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఈ కొత్త యాప్‌ను రూపొందించింది. ఇది కేవలం మెసేజింగ్ యాప్‌గా మాత్రమే కాకుండా, అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది.

స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

భారతదేశంలో టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 'జోహో' ఈ 'అరట్టై' యాప్‌ను అభివృద్ధి చేసింది. వినియోగదారుల డేటా గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, తమ యూజర్ల డేటా అంతా పూర్తిగా భారతదేశంలోనే సురక్షితంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం విదేశీ యాప్‌లతో డేటా డేటా సేఫ్టీ ఆందోళనల 'అరట్టై'కి కలిసిరానుంది.

యాప్ ఫీచర్లు ప్రత్యేకతలు: 'అరట్టై' యాప్ వాట్సాప్‌లో ఉన్న సాధారణ ఫీచర్లతో పాటు అదనపు ప్రత్యేకతలను అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా...

  • ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్: పర్సనల్, గ్రూప్ చాట్‌లకు పూర్తి భద్రత.
  • వాయిస్ & వీడియో కాల్స్: స్పష్టమైన కాల్ క్వాలిటీతో పాటు గ్రూప్ కాలింగ్ ఫీచర్ కూడా.
  • ఛానెల్స్: వార్తలు, సమాచారం కోసం సబ్‌స్క్రైబ్ చేసుకునే అవకాశం.
  • డాక్యుమెంట్ షేరింగ్: ఆఫీస్ ఫైల్స్ సహా అన్ని రకాల డాక్యుమెంట్లను సీజీగా షేర్ చేసుకోవచ్చు.
  • లోకల్ ల్యాంగ్వేజ్‌లు: తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ఈ యాప్‌ను ఉపయోగించుకునే అవకాశం.

వాట్సాప్ లానే ఇంటర్‌ఫేస్‌ కలిగి ఉండటంతో కొత్త యూజర్లు కూడా ఈ యాప్‌ను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. 

Advertisment
తాజా కథనాలు