WhatsApp: వాట్సాప్ మరో కొత్త ఫీచర్..స్టేటస్ కూ నోటిఫికేషన్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇక మీదట తనము ఇష్టమైన యూజర్లు కొత్త స్టేటస్ ను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును. 

New Update
whatsapp

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా  వాట్సాప్(whatsapp) నంబర్ వన్ మేసేజింగ్ యాప్ గా దూసుకుని వెళుతోంది. దీని తర్వాత చాలా మెసేజింగ్ యాప్ లు వచ్చినప్పటికీ వాట్సాప్ ను మాత్రం బీట్ చేయలేకపోయాయి. దీనికి కారణం మెటా వాట్సాప్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ..కొత్త ఫీచర్లను కూడా యాడ్ యూజర్లను ఆకర్షిస్తోంది. తాజాగా వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ను యాడ్ చేస్తోంది మెటా. ప్రస్తుతం ఇది పరీక్షల్లో ఉంది. దీని ప్రకారం ఇక మీదట తమకు ఇష్టమైన కాంటాక్టులు కొత్త స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును. ఆండ్రాయిడ్ లోని వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ ట్రయల్ దశలో ఉందని వాబిటా ఇన్ఫో తన బ్లాగ్‌ పోస్ట్‌లో చేసింది. దీనిని దశల వారీగా విడుదల చేస్తామని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం యూజర్ ఎక్స్‌పీరియన్‌లను పరిశీలిస్తున్నారు. 

Also Read :  వామ్మో.. 50mp ఫ్రంట్ కెమెరా స్మార్ట్ ఫోన్ పై రూ.4వేల భారీ తగ్గింపు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

ఎలా సెట్ చేసుకోవాలి...

వాట్సాప్ సెట్టింగ్స్ లో కొత్త ఫీచర్(whatsapp-new-feature) ను ఎలా చేసుకోవాలో మెటా వివరించింది. దీని కోసం వాట్సాప్ లోని యూజర్లు తమకు కావాల్సిన కాంటాక్ట్ స్టేటస్ ను ఓపెన్ చేసి పై భాగంలో ఉన్న మూడు చుక్కలపై ట్యాప్ చేయాలి. ఆ తరువాత అక్కడ ఉండే Get notifications’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే దీని తరువాత నుంచి  కాంటాక్ట్ షేర్ చేసిన ప్రతీసారి నోటిఫికేషన్ వస్తుంది. ఎంపిక చేసిన కాంటాక్ట్‌ స్టేటస్‌ పెట్టినపుడు.. వాట్సప్‌ వెంటనే అలర్ట్‌ పంపుతుంది. ఆ స్టేటస్‌లో ఇమేజ్‌ లేదా వీడియో ఉంటే నోటిఫికేషన్‌లో చిన్న ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. మొత్తం స్టేటస్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్ లోనే అప్ డేట్ ఏంటో తెలుసుకోవచ్చును. అలాగే మనకు వద్దనుకుంటే ఈ నోటిఫికేషన్ ను ఆఫ్ కూడా చేసుకోవచ్చును. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే..అలర్ట్‌ ఎనేబుల్‌ చేసిన విషయం ఆ కాంటాక్ట్‌కి తెలియదు. ఫుల్ ఫ్రైవసీకి మెటా ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇస్తుందని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.

ఏఐ ఫీచర్..

అంతకు ముందు రెండు నెలల క్రితం యూజర్ కి అసిస్ట్ చేయడానికి  ఏఐ రైటింగ్ అసిస్టెంట్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. మీకు ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడినప్పుడు ఈ టూల్ హెల్ప్ చేస్తుంది. ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ, ఓదార్పు మెసేజ్ ఇలా ఏ రకమైన మెసేజ్ మీరు రాయాలనుకుంటే.. దానికి తగిన సూచనలను ఈ ఏఐ ఫీచర్ కొన్ని సెకన్లలో ఇస్తుంది. ఆ తర్వాత ఏఐ జనరేట్ చేసిన మెసేజ్ ని మీరు డైరెక్ట్ గా పంపుకోవచ్చు లేదా మీకు నచ్చినట్లుగా, కావాల్సినట్లుగా మార్పులు చేసుకోవచ్చు.  ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఇది వాట్సాప్ టెస్టింగ్ వెర్షన్లో  అందుబాటులోకి వచ్చింది. 

Also Read: Trump On Russia Oil: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదు...ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు