వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఆ మెస్సేజ్‌లతో ఇబ్బంది పడే వారు ఎరిగి గంతేస్తారు!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం నిరంతరం కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా, యూజర్లను ఇబ్బంది పెట్టే అనవసరమైన ప్రచార సందేశాలు, స్కామ్‌లను అరికట్టేందుకు త్వరలో సరికొత్త 'యాంటీ-స్కామ్ ఫీచర్'ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.

New Update
whatsapp

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం నిరంతరం కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా, యూజర్లను ఇబ్బంది పెట్టే అనవసరమైన ప్రచార సందేశాలు, స్కామ్‌లను అరికట్టేందుకు త్వరలో సరికొత్త 'యాంటీ-స్కామ్ ఫీచర్'ను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేయనుందని సమాచారం. తెలియని నంబర్ల నుండి వచ్చే స్పామ్, మోసపూరిత సందేశాలను గుర్తించి, యూజర్లు వాటి బారిన పడకుండా హెచ్చరించడమే దీని ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా, 'జాబ్ ఆఫర్స్', 'లాటరీ గెలుచుకున్నారు' అది కొనండి, ఇది తీసుకోండనే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనుమానాస్పద సందేశాలను ఈ ఫీచర్ సులభంగా గుర్తిస్తుంది.

ఇప్పటికే వాట్సాప్‌లో స్కామ్ డిటెక్షన్ కోసం కొన్ని భద్రతా చర్యలు ఉన్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే ఈ ఫీచర్ మరింత పటిష్టంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. గ్రూప్ చాట్‌లలో కూడా కొత్తవారు యాడ్ చేసినప్పుడు 'సేఫ్టీ ఓవర్‌వ్యూ' వంటి హెచ్చరికలను అందించే ఫీచర్లను వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టింది.

కొత్త యాంటీ-స్కామ్ ఫీచర్ ద్వారా, ప్రచార మెసేజ్‌ల సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని కంపెనీ యోచిస్తోంది. అనవసరమైన, హానికరమైన కంటెంట్ యూజర్లను చేరకుండా నిరోధించడం, తద్వారా ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా మార్చడం దీని ఉద్దేశం. ఈ ఫీచర్ మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చి, ఆ తర్వాత దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చర్య వాట్సాప్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.

Advertisment
తాజా కథనాలు