Passenger Train: తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు.