Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 22 మంది దుర్మరణం

థాయ్‌లాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

New Update
At least 22 people killed when crane falls on train in northeast Thailand

At least 22 people killed when crane falls on train in northeast Thailand

థాయ్‌లాండ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారీ పడటం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సిఖియో జిల్లాలో హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు కొనసాగుతుండగా ఓ క్రేన్‌ కంట్రోల్ తప్పి కిందపడిపోయింది. అదే సమయంలో కింద పట్టాలపై ప్యాసెంజర్‌ రైలు వెళ్తుండగా దానిపైనే క్రేన్‌ పడింది.   

Also Read: నేడు మకరజ్యోతి దర్శనం..అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతున్న శబరిగిరి

దీంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 22 మంది మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రైలుకు మూడు బోగీలు ఉండగా చివరి రెండు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఈ రైలులో 195 మంది ప్రయాణికులు ప్రయణిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు