/rtv/media/media_files/2025/11/18/nellore-crime-news-2025-11-18-13-46-42.jpg)
Nellore Crime News
నెల్లూరు జిల్లా కావలిలో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని కొండాపురం మండలం సాయిపేట గ్రామం అరుంధతివాడికి చెందిన పుండ్ల హవీలా షారోన్‌గా గుర్తించారు. షారోన్ కావలిలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది.
రైలు ట్రాక్ దాటుతుండగా...
షారోన్ రోజువారీ మాదిరిగానే తన కాలేజీకి వెళ్లడానికి వచ్చి ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో ఉన్న రైలు ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షారోన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. - train accident
ఇది కూడా చదవండి: గుండె పగిలే విషాదం.. నువ్వు లేని జీవితం నాకొద్దంటూ..
ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైలు ట్రాక్ దాటే సమయంలో విద్యార్థిని నిర్లక్ష్యం కారణమా..? లేక రైలు రాకను గమనించలేకపోయిందా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలం వద్దకు భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుకోవడంతో విషాద వాతావరణం నెలకొంది. తమ సహచర విద్యార్థిని హఠాన్మరణం చెందడం పట్ల విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షారోన్ కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. యువ ఇంజినీరింగ్ విద్యార్థిని అకాల మరణం కావలిలో తీవ్ర విషాదాన్ని నింపింది. రైలు పట్టాలు దాటేటప్పుడు ప్రయాణికులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దండుపాళ్యం కంటే దారుణంగా ఉన్నారు.. హోంగార్డుపై నలుగురు అత్యాచారం!
Follow Us