Train Crash: 2 రైళ్లు ఢీ.. 39 మంది మృతి.. వీడియో వైరల్

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన హైస్పీడ్‌ రైలు మరో హైస్పీడ్ రైలును ఢీకొంది. ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మరో 159 మంది గాయాలపాలయ్యారు.

New Update
Spain train crash, At least 39 dead

Spain train crash, At least 39 dead

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన హైస్పీడ్‌ రైలు మరో హైస్పీడ్ రైలును ఢీకొంది. ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మరో 159 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే స్పెయిన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆదివారం సాయంత్రం ఓ హైస్పీడ్ రైలు మలాగా నుంచి మాద్రీద్‌కు బయలుదేరింది. ఈ రైలులో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Also Read: ట్రంప్ ఒత్తిడి.. చాబహర్‌ పోర్టు నుంచి తప్పుకోనున్న భారత్‌ !

200 మంది ప్రయాణికులతో మరో హైస్పీడ్ రైలు మాద్రీద్ నుంచి హువెల్వాకు వస్తోంది. అయితే మాద్రీద్‌కు 370 కి.మీ దూరంలో రాత్రి 7.45 గంటలకు మొదటి రైలు పట్టాలు తప్పడంతో దాని చివరి బోగీలు పక్క ట్రాక్‌పైకి వెళ్లాయి. అదే సమయంలో మరో రైలు వేగంగా రావడంతో ఆ బోగీలను ఢీకొంది. దీంతో రెండో రైలు ముందు భాగంలోని రెండు బోగీలు నుజ్జు నజ్జయ్యాయి. 13 అడుగుల లోతైన లోయలో పడిపోయాయి.

Also Read: కుల్దీప్‌ సెంగర్‌కు బిగ్ షాక్.. శిక్ష రద్దు పిటిషన్‌ను కొట్టివేసి కోర్టు

ఈ బోగీల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు అద్దాలను బ్రేక్ చేసి బయటపడ్డారు. అయితే బోగీలను వెలికితీస్తే మృతులు సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గాయాలపాలైన వారిలో 29 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు