Iran Ceasefire: యుద్ధం ఆగలేదు.. ఇరాన్ సంచలన ప్రకటన!
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌తో ఇప్పటివరకు ఎలాంటి సీజ్ఫైర్ ఒప్పందం జరగలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్ 238 FC మ్యాచుల్లో 898 వికెట్లు తీశారు.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్దంలోకి ఉత్తర కొరియా ఎంటర్ అయ్యింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఇరాన్‌కు మద్దతుగా నిలిచాడు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను సోమవారం కిమ్ ఖండించారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోకి గొర్రెలను పంపి యాదవులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రివర్గంలో యాదవ సామాజిక వర్గానికి స్థానం కల్పించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. గొర్ల కాపరుల సంక్షేమ సంఘం సోమవారం ఉదయం గొర్రెలను పంపారు.
5ఏళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడులో చోటుచేసుకుంది. ఆ బాలిక ఆడుకుంటుండగా ఆ బాలుడు గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు బాలుడిపై పోక్సో కేసు నమోదుచేశారు.
పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్దంలోకి దిగింది. ఈ తరుణంలో యుద్ధంలోకి మరో దేశం అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరాన్‌కు మద్దతుగా యెమెన్ యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమైంది.
సిరియాలోని ఓ చర్చిలో ఆదివారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది చనిపోయారు. 53 మంది గాయాలపాలయ్యారు. రాజధాని డమాస్కస్ సమీపంలోని వెలాలో మార్ ఎలియాస్ చర్చిలో దుర్ఘటన జరిగింది.
యూపీలోని దారుణం జరిగింది. 22 ఏళ్ల నర్సుపై అంబులెన్స్ డ్రైవర్ రోహిత్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి నేలపైకి తోసేశాడు. దుస్తుల్లో చేయిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అరవడంతో అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ఒక్క టూవీలర్‌పై వందల్లో చలాన్లు దర్శనమివ్వడంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఖంగుతిన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అటువైపుగా వచ్చిన ఓ స్కూటీని ఆపి పెండింగ్ చలాన్లను చెక్ చేయగా 233 చలాన్లు ఉండటంతో షాకయ్యారు.