AP Crime: ఏపీలో దారుణం.. 5ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన బాలుడు - గడ్డివాము దగ్గరకు తీసుకెళ్లి !

5ఏళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా వెలుగోడులో చోటుచేసుకుంది. ఆ బాలిక ఆడుకుంటుండగా ఆ బాలుడు గడ్డివాము వద్దకు తీసుకెళ్లాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు బాలుడిపై పోక్సో కేసు నమోదుచేశారు.

New Update
POCSO case registered against boy for sexually assaulting five-year-old girl in Nandyal

POCSO case registered against boy for sexually assaulting five-year-old girl in Nandyal

రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే కాటువేసేద్దామని కొందరు కాచుకు కూర్చుంటున్నారు. ఇలాంటి అసభ్యకర, అసాంఘీక చర్యలకు పాల్పడుతున్న వారిలో పెద్దవారే కాదు.. చిన్నవారు కూడా ఉండటం అత్యంత బాధ కలిగించే విషయం అనే చెప్పాలి. కొందరు చిన్న వయసులో చదువుపై దృష్టి పెట్టకుండా.. మహిళలను లైంగికంగా వేధించి, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌

5ఏళ్ల బాలికపై రేప్

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 5ఏళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి

నంద్యాల జిల్లా వెలుగోడు ఎస్సై సురేశ్‌ తెలిపిన సమాచారం ప్రకారం.. వెలుగోడుకు చెందిన 5ఏళ్ల చిన్నారి శనివారం బయట ఆడుకుంటుంది. అదే సమయంలో పక్క కాలనీకి చెందిన ఓ బాలుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. సమీపంలో ఉన్న గడ్డివామి వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

వెంటనే ఈ విషయం ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

 

Latest crime news | ap-crime-news | nandyala-district | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news | andhra-pradesh-crime-reports | telugu crime news | breaking news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు