/rtv/media/media_files/2025/06/22/telangana-traffic-police-seized-two-wheeler-with-233-pending-challans-2025-06-22-08-45-38.jpg)
telangana traffic police seized two wheeler with 233 pending challans
సాధారణంగా చాలా మంది ప్రజలు కొత్త వెహికల్స్ కాకుండా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొంటుంటారు. కొత్త వెహికల్స్ అధిక ధరతో కూడుకున్నవి కావడంతో తక్కువ ధరకు దొరికే పాత స్కూటర్లు, బైక్‌లను ఎక్కువగా కొనుక్కుని తిరుగుతుంటారు. కానీ ఆ వాహనాలపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా?, పెండింగ్ చలానాలు ఉన్నాయా? లేవా?.. మరేదైనా ఇష్యూస్ ఉన్నాయా? అనేది మాత్రం తెలుసుకోరు.
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
దీంతో పాత వాహనాన్ని కొనుక్కుని.. ఒక్కసారిగా పోలీసులకు దొరికిన తర్వాత దానిపై ఉన్న బండారమంతా బయటపడుతుంది. అనంతరం ఆ వెహికల్ కొనుక్కున్న వ్యక్తి చుక్కలు చూడాల్సిందే. చాలా వరకు కేసులు ఇలాంటివే నమోదు అవుతున్నాయి. అందుకే వీటిపై పోలీసులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ముక్కుమొఖం తెలియని వారివద్ద కొనకూడదని చెబుతున్నారు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఒక్క బండి.. రూ.45వేల చలానా
తాజాగా ఇలాంటిదే ఓ ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిన్న (శనివారం) కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఆ సమయంలోనే ఓ వ్యక్తి తన స్కూటీతో అటువైపుగా వచ్చాడు. ఆ స్కూటీని ఆపిన పోలీసులు.. పెండింగ్ చలాన్లను చూసేందుకు రీడింగ్ మెషిన్‌లో బండి నెంబర్ ఎంటర్ చేశారు.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
అనంతరం వచ్చిన రిజల్ట్ చూసి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్నతో సహా స్కూటీ యజమాని సైతం షాక్‌కు గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో ఉన్న చలాన్లు దర్శనమిచ్చాయి. మొత్తం 233 చలాన్లు రావడంతో ఆశ్చర్యపోయారు. వాటిపై రూ.45,350 ఫైన్ ఉన్నట్లు గుర్తించారు.
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
దాదాపు 2016 నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే స్కూటీ యజమాని మాత్రం.. తాను ఏడాది కిందటే కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దగ్గర కొనుక్కున్నానని తెలిపాడు. దానిపై చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయన్న విషయం తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం పోలీసులు ఆ స్కూటీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
warangal | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana-traffic-police | pending-challans
Follow Us