/rtv/media/media_files/2025/06/22/uttar-pradesh-bhadohi-nurse-raped-by-ambulance-driver-in-private-hospital-2025-06-22-10-13-38.jpg)
Uttar Pradesh bhadohi nurse raped by ambulance driver in private hospital
ఉత్తరప్రదేశ్‌లోని భడోహిలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. 22 ఏళ్ల నర్సుపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్
Nurse Raped By Ambulance Driver
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ నెల అంటే జూన్ 5న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సు ఫోన్‌లో మాట్లాడుతుండగా.. అంబులెన్స్ డ్రైవర్ రోహిత్ అలియాస్ మోహిత్ ఆమె వద్దకు వచ్చి లైంగికంగా వేధించాడు. దీంతో వెంటనే ఆ నర్సు అంగీకరించకపోవడంతో.. ఆమె జుట్టు పట్టుకుని కొట్టాడు.
Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!
ఆ తర్వాత ఆమెను నేలపై పడేశాడు. అనంతరం నర్సు దుస్తుల్లోకి చేయి పెట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ నర్సు గట్టిగా అరవడంతో.. ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, ఇతర వ్యక్తులు వచ్చి ఆమెను రక్షించారు. అయితే వాళ్లు రావడం చూసి నిందితుడు రోహిత్ అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రోహిత్ పై కేసు నమోదు చేశారు.
Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?
IPC సెక్షన్లు 76, 352, 115 (2) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రోహిత్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నర్సు, నిందితులు ఇద్దరూ దళిత వర్గానికి చెందినవారు. ఈ సంఘటన తర్వాత నర్సు కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
Also Read : బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..
latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | ambulance-driver