BIG BREAKING : నలుగురు అల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్‌

అల్‌ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు వీరిని అరెస్టు చేశారు.  గుజరాత్‌ లో ఇద్దరు ఢిల్లీ, నోయిడాలో చెరకోరు అరెస్ట్ అయ్యారు.

New Update
gujarat

నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులు అరెస్టయ్యారు. గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఇద్దరు గుజరాత్‌లో పట్టుబడగా, మిగిలిన వారిని ఢిల్లీ, నోయిడాలో అరెస్టు చేశారు.మొహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీ మరియు మొహమ్మద్ ఫైక్‌లుగా గుర్తించబడిన నలుగురూ సోషల్ మీడియా యాప్ ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వారి ప్రణాళికలు ఏమిటి అనే  వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఆ నలుగురిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు చాలా కాలంగా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని గుజరాత్ ఏటీఎస్ అధికారులు తెలిపారు. 

ఒసామా బిన్ లాడెన్ గురువు షేక్ అబ్దుల్లా అజ్జాం సృష్టించిన మఖ్తబ్ అల్-ఖిదామత్ నుంచి అల్-ఖైదా ఉద్భవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి ఈ సంస్థ పనిచేసింది. అల్-ఖైదా, దాని అనుబంధ సంస్థలు ఈ సంస్థ నుండి ప్రేరణ పొందిన వారు ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో దాడులను ప్లాన్ చేయడంలో, అమలు చేయడంలో పాలుపంచుకున్నారు.

Advertisment
తాజా కథనాలు