BIG BREAKING: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాలకు చిక్కిన  జైషే మహమ్మద్ ఉగ్రవాదులు!

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జైషే మహమ్మద్ ముఠాకి చెందిన ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరిని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జైషే మహమ్మద్ ముఠాకి చెందిన ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరిని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. ఉధంపూర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉన్నట్లు నిఘా వర్గాల వారికి సమాచారం వచ్చింది. దీంతో ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి.

ఇది కూడా చూడండి: భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

ఎదురు కాల్పులు..

ఈ క్రమంలోనే ఉధంపూర్‌లోని దుడు బసంత్‌గఢ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా  బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. అయితే భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం ఇక్కడే ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. 

ఇది కూడా చూడండి: BREAKING: భద్రతా దళాలపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి

Advertisment
తాజా కథనాలు