నటుడు కపిల్ శర్మ కేఫ్‌పై ఉగ్రవాదుల కాల్పులు

ప్రముఖ యాంకర్, కమెడియన్ కపిల్ శర్మపై కాల్పులు జరిగాయి. కెనడాలో కపిల్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ KAP'S CAFE పై గుర్తుతెలియని దుండగులు అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. ఫైరింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
Kapil Sharma cafe

బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన KAP's కేఫ్‌పై కాల్పులు కలకలం రేపింది. కెనడాలోని సర్రేలో జూలై 9 రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) పలు రౌండ్లు ఫైరింగ్ జరిగింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక దుండగుడు వాహనం లోపలి నుండి కేఫ్ లక్ష్యంగా చేసుకుని అనేక రౌండ్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో కస్టమర్లు ఎవరూ లేరు. బెదిరించాలనే ఉద్దేశ్యంతోనే ఈదాడి జరిగినట్లు తెలుస్తోంది. 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డి కాల్పులకు బాధ్యత వహించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఆపరేటివ్ లడ్డి, గతంలో కపిల్ శర్మ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ దాడి చేయించినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు