/rtv/media/media_files/2025/08/13/jihadis-2025-08-13-07-26-31.jpg)
Bed Room Jihadis
కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కొత్త తలనొప్పులు మొదలైయ్యాయి. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఉగ్రవాదులతో పోరాడుతున్న వారికి ఇప్పుడు కనిపించని వారితో కూడా పోరాటం చేయాల్సి వస్తోంది. బెడ్ రూమ్ జీహాదీల పేరుతో వీరు చేస్తున్న పనులు అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నాయి. మామూలు ఉగ్రవాదుల కన్నా వీరితో చాలా కష్టం అవుతూందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. జమ్మూ , కాశ్మీర్ ను ఈ బెడ్ రూమ్ జీహాదీలు అస్థిరరిచే ప్రయత్నాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు.
ఎవరీ బెడ్ రూమ్ జీహాదీలు..
వీళ్ళెవరో ఎవరికీ తెలియదు. అసలు కంటికి కనిపించరు. కానీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడమే కాక..జీహాదీని ప్రేరేపిస్తుంటారు. వర్గ విభేదాలు సృష్టిస్తూ కాశ్మీర్ లో ప్రజలను రెచ్చగొడుతున్నారు. మత కలహాలు, అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో పోషల్ మీడియాలో వేల ఖాతాలను క్రియేట్ చేసి విధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎవరు చేస్తున్నారో తెలియకపోవడమే ఇక్కడ పెద్ద తలనొప్పి. పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతిపరులు దీన్ని నియంత్రిస్తున్నట్లు అధికారులు తమ దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాక్‌లో ఉన్న హ్యాండ్లర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి.
ఇంట్లోనే కూర్చుని కంప్యూటర్లు, సెల్ ఫోన్ల సాయంతో వీళ్ళు భారత్ పై యుద్ధం చేస్తున్నారు. అందుకే వీరిని బెడ్ రూమ్ జీహాదీలని వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కాశ్మీర్ లో రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టారని..శ్రీనగర్ పోలీసులు సరైన సమయంలో స్పందించడంతో అది పెద్ది అవలేదని ఓ అధికారి చెప్పారు. ఆ సమయంలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించగా...పాకిస్తాన్ నుంచి తనకు గొడవ చేయాలని ఆదేశాలు వచ్చాయని తెలిపాడన్నారు.
నిజానికి ఈ రకమైన బెడ్ రూమ్ జీహాదీ 2017లో మొదలైంది. 2019 లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ లో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. దీంతో అది కాస్త నెమ్మదించింది. కానీ గత ఏడాది ఎన్నికల తర్వాత మళ్ళీ వీళ్ళు రెచ్చిపోతున్నారు. కాశ్మీర్ లో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎలా అయినా కూలగొట్టాలని కంకణం కట్టుకుని మరీ పని చేస్తున్నారు. ఇవి రోజురోజూ కొత్త రూపాలు మార్చుకుంటూ చాలా విసృతమవుతున్నాయి. ఒకవైపు కాశ్మీర్ లో లోయల్లో, గుహల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి కష్టపడుతూనే మరోవైపు ఈ బెడ్ రూమ్ జీహాదీలతో పోరాటం చేయవలసి వస్తోందని భద్రతా దళ అధికారులు చెబుతున్నారు. ఎలా అయినా వారిని కట్టడి చేయాలని లేకపోతే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.