USA: అమెరికాలో 8 మంది భారతీయులు అరెస్టు.. వీరిలో పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కూడా!

అమెరికాలో 8 మంది భారతీయులను అక్కడ అధికారులు హింస, కిడ్నాప్ కేసుల్లో వారిని అరెస్టు చేశారు. వీరిలో జాతీయ దర్యాప్తు సంస్థ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా ఉన్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

New Update
USA

USA

అమెరికాలో 8 మంది భారతీయులను అక్కడ అధికారులు హింస, కిడ్నాప్ కేసుల్లో వారిని అరెస్టు చేశారు. వీరిలో జాతీయ దర్యాప్తు సంస్థ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా కూడా ఉన్నాడు. ఇతనికి ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే పవిత్తర్ సింగ్‌తో పాటు దిల్‌ప్రీత్ సింగ్, అర్షప్రీత్ సింగ్, అమృత్‌పాల్ సింగ్, విశాల్, గుర్తజ్ సింగ్, మన ప్రీత్ రాంధావా, సరబ్‌జిత్ సింగ్‌గా అధికారులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: Smartphone Offers: ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

ఇది కూడా చూడండి:Radhika Yadav: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

హింసకు పాల్పడుతున్నారని..

వీళ్లందరికీ కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాలిఫోర్నియాలో కొందరు బెదిరింపులు, హింసకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే అక్కడ అధికారులు ప్రత్యేకంగా ఆపరేషన్ చేపట్టారు. వీరి నివాసాలపై దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మందు గుండు సామాగ్రి, ఆయుధాలు, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ అమెరికాలోకి వీరు చట్ట విరుద్ధంగా వెళ్లారు. అయితే భారత దేశంలో వీరిపై ఇప్పటికే కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు