Pahalgam Attack: 26 మందిని చంపి శవాల వద్ద సంబరాలు.. పహల్గామ్ దాడిపై వెలుగులోకి షాకింగ్ విషయాలు!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బైసరన్ లోయలో ఉగ్రవాదులు గాల్లోకి తూటాలు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.

New Update
Pahalgam attack

Pahalgam attack

పహల్గామ్ ఉగ్రదాడితో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫ్యామిలీతో సుందరమైన పహల్గామ్ వెళ్లిన వారు శవాలై తిరిగి వచ్చారు. పాక్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ వరుడు మృతి చెందాడు. పెళ్లి జరిగిన వారం రోజులకే భర్త చనిపోవడంతో శవం దగ్గర భార్య పడిన బాధ యావత్తు భారత్‌ను కదిలించింది.

ఇది కూడా చూడండి:TG News: తెలంగాణలో అన్నకు ప్రాణదానం చేసిన చెల్లి.. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు!

ఇది కూడా చూడండి:TG Murder: అక్రమ సంబంధం వల్లే హత్య..   చందు నాయక్‌ హత్య కేసులో సంచలన విషయాలు!

తూటాలు పేల్చి సంబరాలు..

ఈ పహల్గామ్ దాడిలో తాజాగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు గాల్లోకి తూటాలు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బైసరన్ లోయలో దాడి చేసిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడి జరిగిన వెంటనే ఇలా జరుపుకున్నారని తెలుస్తోంది.  

ఇది కూడా చూడండి:పాకిస్థాన్‌కు మరింత గడ్డు కాలం.. ఆగిపోయిన నిధులు, టర్కీతో కటీఫ్ !

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగింది. 26 మంది పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత కశ్మీర్ లోయలో ఉన్న 8 పిక్నిక్ స్పాట్‌లను క్లోజ్ చేశారు. అయితే ఈ పహల్గామ్‌ ఉగ్రదాడి చేసిన వారిలో లష్కరే తోయిబా కమాండర్ సులేమాన్ ఒకరు. ఇతను జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మరో మూడు ఉగ్రవాద సంఘటనలలో వాంటెడ్‌గా ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

celebrations | Jammu Kashmir | Pahalgam attack

Advertisment
Advertisment
తాజా కథనాలు