BIG BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు ఉండనున్నాయి. అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు ఉండనున్నాయి. అక్టోబర్ 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవాడా నియోజకవర్గం ఎమ్మెల్యే విభా దేవీ, రాజౌలీ ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇటీవల తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఏడాది చలికాలం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. శీతల పరిస్థితులకు దారితీసే లానినా తిరిగి రావడం వల్ల ఈ సీజన్ చలి మరింత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు.
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటలకు హైదర్‌గూడలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలటర్ సహా ఇద్దరు మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపుతప్పి రోడ్డుపై కుప్పకూలింది.
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. వీటిని వేలం వేస్తే ఓ కంపెనీ ప్రతినిధులు రూ.కోటికి దక్కించుకున్నారు.