Tanzania Bus Crash: రెండు బస్సులు ఢీ.. మంటల్లో కాలిబూడిదైన 40 మంది ప్రయాణికులు

టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి-టాంగా రహదారిపై చోటుచేసుకుంది. 

New Update
Tanzania bus crash 40 dead over 30 injured

Tanzania bus crash 40 dead over 30 injured

టాంజానియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 40 మంది స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం కిలిమంజారో ప్రాంతంలోని మోషి-టాంగా రహదారిపై చోటుచేసుకుంది. 

Also Read :  నటి పాకీజాను ఆదుకున్న డిప్యూటీ సీఎం పవన్ !

Tanzania Bus Crash

రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని చాలా మంది సజీవ దహనం అయ్యారు. మరెందరో తీవ్రంగా కాలి ప్రాణాలతో బటయపడ్డారు. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే వెళ్లి మంటలను ఆర్పి చాలామందిని రక్షించారు. వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. 

Also Read :  Cancer Anti Drinks: ఎంత ఆశ్చర్యం.. ఈ 3 పానీయాలు క్యాన్సర్ ప్రభావం తగ్గిస్తాయట.. నిపుణులు ఏం చెబుతున్నారో మీరు తెలుసుకోండి!!

బాధితుల్లో ఎక్కువ మంది టాంజానియా పౌరులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘోరమైన ప్రమాదం అనంతరం ఆ దేశ అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘దుఃఖిస్తున్న కుటుంబాలు, బంధువులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను.’’  అని తెలిపారు.

Also Read :  భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? - షాకింగ్ వీడియోస్

స్థానిక మీడియా ప్రకారం.. రెండు బస్సులలో ఒకటి వివాహ కార్యక్రమానికి ప్రయాణికులను తీసుకెళ్తుందని తెలిసింది. కాగా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Also Read :  బీజేపీ అధ్యక్ష పదవి మిస్.. ఎంపీ ఈటల ఫస్ట్ రియాక్షన్!

 

road accident | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | international news in telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు