Portugal Roll Cloud: భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? -షాకింగ్ వీడియోస్

పోర్చుగల్‌లోని ఒక బీచ్‌లో ఎత్తైన సముద్ర కెరటాన్ని పోలి ఉన్న మేఘాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీచ్‌లో చాలా మంది స్నానాలు చేస్తున్న సమయంలో మేఘాలు ఒక్కసారిగా సముద్ర కెరటాన్ని తలపించాయి. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

New Update
Portugal Roll Cloud

Portugal Roll Cloud

మీరు చూస్తున్నది అక్షరాల నిజం.. ఇది సినిమా అస్సలు కానే కాదు. సముద్రంలో సునామీని తలపించేలా మేఘాలు అలుముకున్నాయి. సముద్రం, ఆకాశంలోని మేఘాలు కలిస్తే ఎలా ఉంటుందో.. ఆలోచించడానికే చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి సన్నివేశం కళ్ల ముందే కనిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గజగజ వణికిపోవాల్సిందే. 

Also Read :  ఎదురెదురుగా రెండు బస్సులు ఢీ.. 40 మంది స్పాట్ డెడ్

Portugal Roll Cloud

ఎప్పుడో ‘‘2012 యుగాంతం’’ అనే సినిమా వచ్చింది. ఆ సమయంలో ఈ చిత్రం సినీ ప్రియుల్ని ఎంతగానో భయపెట్టింది. నిజంగానే యుగాంతం రాబోతుందా?.. మనుషులు అందరూ చనిపోతారా?.. అనే భయం అందరిలోనూ కలిగింది. ఆ సినిమాలో చూపించే సన్నివేశాలు నిజజీవితంలో జరగబోతాయా? అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. 

Also Read :  మరో ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్

Also Read :  పాక్, చైనాలకు బిగ్ షాక్.. ఇండియా మాస్టర్‌మైండ్ స్కెచ్

అయితే ఇప్పుడు ఆ మూవీలోని కొన్ని సన్నివేశాల మాదిరిగానే రియల్ లైఫ్‌లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆకాశం, భూమి ఒక్కటయ్యేలా ఓ ఇన్సిడెంట్ కనిపించింది. ఆదివారం పోర్చుగీస్ తీరప్రాంతంలో వాతావరణం బీచ్‌కి వెళ్లేవారిని ఆశ్చర్యపరిచింది. అట్లాంటిక్ నుండి భారీ ‘‘రోల్ క్లౌడ్’’ ఎగసిపడింది. ఇది ఎత్తైన సముద్ర కెరటాన్ని పోలి ఉంది. ఇప్పటి వరకు పోర్చుగీస్‌లో ఎండలు బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన వేడిగాలులతో అక్కడి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. 

Also Read :  మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్‌

ఈ క్రమంలో సముద్ర కెరటం మాదిరి కనిపించిన దృశ్యంతో బీచ్‌లో ఉన్నవారంతా షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. ఇది నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం..  వేడి, పొడి గాలి చల్లటి సముద్రపు గాలులతో ఢీకొన్నప్పుడు అవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Viral Video | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu | telugu viral news

Advertisment
తాజా కథనాలు