AGNI 5: పాక్, చైనాలకు బిగ్ షాక్.. ఇండియా మాస్టర్‌మైండ్ స్కెచ్

పాక్‌తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది.

New Update
bunker buster bombs

భారత్‌కు పక్కన పాకిస్తాన్, చైనా ప్రమాదకరంగా మారుతున్నాయి. పాక్‌తో ఇటీవల ఏర్పడిన వివాదాల కారణంగా భారత్ యుద్ధం అంచల వరకూ వెళ్లింది. దీంతో ఇండియా రక్షణరంగంపై ఫోకస్ చేసింది. బంకర్ బస్టర్ బాంబుల తయారీని వేగవంతం చేసింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు సిద్ధమయ్యేందుకు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను నిర్మిస్తోంది. డీఆర్‌డీఓ అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించడం కోసం అగ్ని-5లో 2 కొత్త రకాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిసింది. వీటిలో ఒకటి భూమిపై ఉన్న టార్గెట్‌ కోసం, మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించేదిగా రూపొందించనున్నారు.

Also Read :  భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? -షాకింగ్ వీడియోస్

అగ్ని క్షిపణి 5 బంకర్ బాంబులు

కాంక్రీటు గోడలతో శత్రు దుర్బేధ్యంగా నిర్మించిన భూగర్భ కేంద్రాల (బంకర్లు)ను సైతం ధ్వంసం చేసేలా దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో దీని పరిధిని కూడా 2,500 కిలోమీటర్లకు కుదించారు. అలాగే ఇది మోసుకెళ్లే బంకర్‌ బస్టర్‌ బాంబు 80 నుంచి 100 మీటర్లమేర భూగర్భంలోకి చొచ్చుకుపోగలదని భావిస్తున్నారు. అగ్ని-5తో పోలిస్తే కొత్త వేరియంట్‌లో 2,500 కిలోమీటర్ల పరిధి తగ్గినప్పటికీ.. విధ్వంసక సామర్థ్యం, కచ్చితత్వం భారత వ్యూహాత్మక ఆయుధాల్లో దీన్ని కీలక శక్తిగా మారుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలలోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు, భూగర్భ క్షిపణి, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. కొత్తగా రూపొందించే క్షిపణి 7500 కిలోల బరువు ఉన్న భారీ బంకర్-బస్టర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.

Also Read :  వేసవిలో కిడ్నీ రాళ్ళ సమస్య తలెత్తే ప్రమాదం.. నిపుణులు ఏమంటున్నారంటే...!!

Also Read :  మనిషి ఆయుష్షు 150-200 ఏళ్లు: బాబా రాందేవ్‌

అమెరికా బీ-2 బాంబర్ దాడులు

ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో జూన్ 22న ఇరాన్‌లోని ఫోర్డో అణు కర్మాగారంపై అమెరికా బంకర్-బస్టర్ బాంబులను వేసింది. బీ-2 బాంబర్ విమానాల నుంచి GBU 57/ఏ మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్స్ బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో ఇరాన్ అణు కర్మాగారం తీవ్రంగా ధ్వంసం కావడంతో ప్రపంచం దృష్టి దానిపైనే పడింది. ఇరాన్ తన అణు కర్మాగారాన్ని పర్వతాల మధ్య, భూమికి 100 మీటర్ల లోతులో నిర్మించింది. సాధారణ బాంబులతో ఈ న్యూక్లియర్ స్థావరాలను నాశనం చేయడం చాలా కష్టం. అందుకే అమెరికా బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఈ బాంబులు 60 మీటర్ల నుంచి 70 మీటర్ల రంధ్రం చేసి మరీ భూమిలోకి చొచ్చుకువెళ్లి పేలే గుణాన్ని కలిగి ఉంటాయి. శత్రువుల భూగర్భ బంకర్లను కూడా నాశనం చేసేందుకు ఈ బంకర్ బ్లస్టర్ బాంబులను ఉపయోగిస్తారు.

Also Read :  సీమాంతర ఘర్షణలు.. ఆ దేశ ప్రధానిపై వేటు

latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
తాజా కథనాలు