/rtv/media/media_files/2025/07/01/pawan-kalyan-financial-help-to-actress-vasuki-2025-07-01-15-18-02.jpg)
pawan kalyan financial help to actress Vasuki
Pawan Kalyan: టాలీవుడ్ తెరపై 'పాకీజా' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న నటి వాసుకీ.. ప్రస్తుతం పూటగడవని స్థితిలో ఉన్నారు. ఇటీవలే ఓ మీడియాతో మాట్లాడిన ఆమె తన దీనపరిస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పూట గడవడం కోసం బిక్షాటన చేసే దుస్థితికి చేరానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న డబ్బులన్నీ అమ్మ వైద్యం కోసం ఖర్చు చేశానని, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో దుర్భర జీవనం కొనసాగిస్తున్నాని భావోద్వేగానికి గురైంది. తమిళ ఇండస్ట్రీలో తనని ఎవరూ ఆదుకోకపోవడంతో.. ఇప్పుడు సాయం కోసం ఏపీకి వచ్చానని తెలిపింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది.
పవన్ ఆర్ధిక సహాయం!
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకీజా దీనస్థితికి చలించిపోయి ఆమెను ఆదుకున్నారు. రూ. 2 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ శ్రీ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ఆ డబ్బును పాకీజాకు అందజేశారు.
Also Read: Shefali Jariwala: షఫాలీ కేసులో బిగ్ ట్విస్ట్.. బెడ్ రూమ్‌లో ఆ టాబ్లెట్ గుర్తించిన పోలీసులు!
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/01/pawan-help-to-actress-pakeezah-2025-07-01-15-28-31.png)
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు
ఈ మేరకు నటి పాకీజా పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నిన్ననే న ఆర్థిక పరిస్థితి గురించి పవన్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణమే స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమోషనల్ అయ్యారు పాకీజా.
Also Read : Mangli Photos: మంగ్లీ బోనాల స్పెషల్.. అమ్మవారిలా ఎంత బాగుందో! ఫొటోలు చూశారా