Secunderabad మిలిటరీ ఏరియాలో చొరబాటు.. నలుగురు అరెస్ట్
సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.
సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు.
కొండా మురళి వ్యవహారంపై పీసీసీ అబ్జర్వర్లను నివేదిక ఇవ్వమని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. బనకచర్ల విషయంలో తమ తప్పులు బయటపడతాయన్న భయంతోనే బీఆర్ఎస్ అఖిలపక్ష సమావేశానికి రాలేదన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న జరుపుకుంటారు. హిందూమతంలో శివుడిని మొదటి యోగిగా చెబుతారు. అయితే లింగముద్ర, హనుమాన్ ఆసనము, శాంభవిముద్ర, నటరాజసనములు రోజూ వేస్తే శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సృష్టించడంలో సహాయపడుతుంది.
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రతిరోజూ కొత్త మలుపులు తిరుగుతోంది. రెండు దేశాల మధ్య వివాదం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి భీకరంగా దాడి చేసుకుంటూనే ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఓ కారు డ్రైవర్ వెనక్కి చూసుకోకుండా డోర్‌ను తెరిచాడు. బైక్‌పై వెళ్తున్న జమీర్ కుటుంబానికి ఆ డోర్‌కు తగిలి వాహనం అదుపుతప్పి పడిపోయింది. దీంతో ఫాతిమా అనే మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమార్తె ప్రాణాలతో బయటపడింది.
కడప మున్సిపాల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశం మరోసారి రచ్చరచ్చగా మారింది. జనరల్ బాడీ మీటింగ్ వేదికగా మేయర్, ఎమ్మెల్యే మధ్య మరోసారి వివాదం రాజుకుంది. సమావేశం మందిరంలో కాదని మేయర్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించడం వివాదస్పదమైంది.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బొమ్మ కూడలిలో గంజాయి మత్తులో యువకులు కలకలం రేపారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన మాట్లొడొద్దన్నారు. నిన్న మురళి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఈ రోజు సమావేశమయ్యారు.