Samsung Galaxy S25 FE: ఉఫ్ ఉఫ్.. 256 GB కొంటే 512 GB ఫ్రీ - శాంసంగ్ కొత్త ఫోన్ భలే భలే..!

శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 FEని భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.59,999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 6.7 అంగుళాల డిస్ప్లే, Exynos 2400 చిప్‌సెట్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

New Update
Samsung Galaxy S25 FE launched

Samsung Galaxy S25 FE launched in india with 50mp camera

దక్షిణ కొరియా(South Korea) స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్ భారతదేశంలో Samsung Galaxy S25 FEని విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇందులో Exynos 2400 ప్రాసెసర్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 

Samsung Galaxy S25 FE Price 

Samsung Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 59,999.
8 GB + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 65,999 
8 GB + 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 77,999గా కంపెనీ నిర్ణయించింది.

Also Read :  NANO BANANA AI: నానో బనానా, సారీ ట్రెండ్.. ఒక్క క్లిక్‌తో డబ్బు మాయం..!

Samsung Galaxy S25 FE Offers

శామ్‌సంగ్ తన 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లకు 512 GB వేరియంట్‌కు ఉచిత అప్‌గ్రేడ్ లభిస్తుందని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.  దాదాపు రూ. 5,000 క్యాష్‌బ్యాక్, 24 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉంది. ఇది వైట్, ఐసీబ్లూ, జెట్‌బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 29 నుండి కంపెనీ వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, శామ్‌సంగ్ రిటైల్ స్టోర్‌ల ద్వారా దేశంలో సేల్‌కు రానుంది. 

Also Read :  వామ్మో..వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్న బనానా ఏఐ చీర ట్రెండ్

Samsung Galaxy S25 FE Specs

Samsung Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. దీని డిస్‌ప్లే కోసం విజన్ బూస్టర్, గొరిల్లా గ్లాస్ విక్టస్+ సేఫ్టీ అందించారు. Samsung Galaxy S25 FE ఫోన్ Exynos 2400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ UI 8పై నడుస్తుంది. దీని కోసం ఏడు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, సేఫ్టీ అప్‌గ్రేడ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి మద్దతు ఇస్తుంది.

Samsung Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఇది ముందు భాగంలో 12-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇది Galaxy S24 FE కంటే పెద్ద వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. Samsung Galaxy S25 FE స్మార్ట్‌ఫోన్ 45 W వైర్డు, 15 W వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్దతుతో 4,900 mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపిక విషయానికొస్తే.. 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఆప్షన్‌లు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు