Indian Cricket Team: టీమ్ ఇండియాకు కొత్త స్పాన్సర్.. మారనున్న జెర్సీ.. ఎలా ఉంటుందంటే!?

టీమిండియా క్రికెట్‌ టీమ్‌ జెర్సీకి కొత్త స్పాన్సర్‌ వచ్చేసింది. అపోలో టైర్స్‌ ఈ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 2027 వరకు ఈ సంస్థ టీమిండియా జెర్సీకి స్పాన్సర్‌షిఫ్‌గా ఉండనుంది.

New Update
Apollo Tyres named new sponsor for Indian cricket team after Dream11 exit

Apollo Tyres named new sponsor for Indian cricket team after Dream11 exit

టీమిండియా క్రికెట్‌ టీమ్‌ జెర్సీకి కొత్త స్పాన్సర్‌ వచ్చేసింది. అపోలో టైర్స్‌(Apollo Tyres) ఈ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. 2027 వరకు ఈ సంస్థ టీమిండియా(team-india) జెర్సీకి స్పాన్సర్‌షిప్‌ గా ఉండనుంది. ఇటీవల బీసీసీఐ డ్రీమ్‌ 11(dream-11) తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్‌ కు సంబంధించిన యాప్స్‌పై ఇటీవల కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రీమ్‌ 11పై కూడా ప్రభావం పడటంతో టీమిండియా జెర్సీపై స్పాన్సర్‌షిప్‌ను కోల్పోయింది.  

Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్‌ నుంచి 16 వేల మంది విదేశీయులు ఔట్ !

Apollo Tyres Named New Sponsor For Indian Cricket Team

అపోలో టైర్స్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కించుకున్న నేపథ్యంతో బీసీసీఐ(bcci) కి ఒక్క మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు ఇవ్వనున్నారు. ఇంతకుముందు డ్రీమ్‌ 11 ఒక్కో మ్యాచ్‌కు రూ.4 కోట్లు ఇచ్చేది. అపోలో టైర్స్ 50 లక్షలు అదనంగా ఇవ్వనుంది. ఈ ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్‌లకు ఈ కంపెనీ జెర్సీ స్పాన్సర్‌గా ఉండనుంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్‌ హక్కులు దక్కించుకునేందుకు జేకే టైర్‌, బిర్లా ఓప్టన్ పెయింట్స్‌, కాన్వా లాంటి కంపెనీలు కూడా పోటీపడ్డాయి. చివరికి అపోలో టైర్స్‌ తమ బిడ్‌ను ఖరారు చేసుకుంది. 

Also Read :  Asia Cup 2025: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. యూఏఈ ఘన విజయం.. టోర్నీ నుంచి పాక్ ఔట్?

Advertisment
తాజా కథనాలు