Madhu Yashki: మధుయాష్కికి సీరియస్.. AIG ఆస్పత్రికి తరలింపు!

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

New Update
Madhu Yashki

కాంగ్రెస్ సీనియర్ నేత(congress-senior-leader) మధుయాష్కి(madhu-yashki) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ సచివాలయంలో స్పృహ తప్పి పడిపోయారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసేందుకు వెళ్లిన ఆయన, ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న మధుయాష్కి అనుచరులు, సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు భారీగా AIG ఆస్పత్రి(aig-hospital) కి తరలివస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యంపై హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. 

Also Read :  విద్యుత్‌ శాఖ ADE ఇంట్లో అక్రమాస్తులు.. రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ

TG Congress Senior Leader Madhu Yashki Helath Condition

Also Read :  మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి.. నోటికాడి ముద్ద ఎత్తగొట్టకండి... ర్యాంకర్ల పేరెంట్స్ కన్నీరు

Advertisment
తాజా కథనాలు