/rtv/media/media_files/2025/09/16/teeth-tips-2025-09-16-14-46-35.jpg)
Teeth Tips
చాలామందికి పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం సర్వసాధారణంగా జరిగే సమస్య. దీనిని చాలామంది సాధారణ సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ ఇది మీ నోటి ఆరోగ్యానికి సంబంధించిన ఓ ముఖ్యమైన హెచ్చరిక అని గుర్తించాలి. ఆయుర్వేదం ప్రకారం.. నోరు శరీరానికి ద్వారం లాంటిది. అది ఆరోగ్యంగా లేకపోతే మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆధునిక పరిశోధనలు కూడా చిగుళ్ల వ్యాధులు కేవలం దంతాలకే పరిమితం కాకుండా గుండె జబ్బులు(Heart Problems), మధుమేహం(Diabetes), గర్భధారణ(Pregnency) లో సమస్యలతో కూడా ముడిపడి ఉన్నాయని సూచిస్తున్నాయి. చిగుళ్ల నుంచి రక్తం రావడానికి ప్రధాన కారణం ప్లాక్. ఇది దంతాలపై పేరుకుపోయే ఒక రకమైన మురికి. ఇందులో హానికరమైన బ్యాక్టీరియా చేరి చిగుళ్లలో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీనిని జింజివైటిస్ అని పిలుస్తారు. సకాలంలో దీనికి చికిత్స చేయకపోతే.. ఇది పెరియోడాంటైటిస్‌గా మారి దంతాలు ఊడిపోవడానికి కారణమవుతుంది. పండ్ల నుంచి రక్తం కారుతుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
సీరియస్‌గా తీసుకోకపోతే ప్రమాదాలు..
ఈ సమస్యకు ఇతర కారణాలలో గట్టి బ్రష్ వాడటం, సరైన పద్ధతిలో బ్రష్ చేయకపోవడం, పొగాకు, కొన్ని మందుల దుష్ప్రభావాలు, సిగరెట్లు వాడటం, హార్మోన్ల మార్పులు, శరీరంలో విటమిన్-సి-కె లోపం వంటివి ఉన్నాయని నిపుణులుచెబుతున్నారు. మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులు కూడా చిగుళ్ళను బలహీనపరుస్తాయి. సాధారణంగా చిగుళ్ళ నుంచి రక్తం కారుతుందంటే.. అవి అప్పటికే వాపుతో, ఇన్ఫెక్షన్ బారిన పడ్డాయని అర్థం. కానీ నొప్పి లేకపోవడం వల్ల చాలామంది దీనిని సీరియస్‌గా తీసుకోరు. ఈ సమస్యను నివారించాలంటే.. మొదట బ్రష్ చేసే అలవాటును మార్చుకోవాలి. గట్టిగా లేదా గట్టి బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌తో పళ్లు తోమడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రష్ ఉపయోగించి నెమ్మదిగా గుండ్రంగా తిప్పుతూ శుభ్రం చేయడం ఉత్తమం. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి: చాక్లెట్ ఇష్టమని ఎక్కువగా తినేస్తున్నారా..? అయితే మీకు గుండెపోటు రావచ్చు!!
ఆయుర్వేదంలో పసుపు, వేప పుల్లలతో పళ్లు తోమడం, త్రిఫలతో పుక్కిలించడం వంటివి సూచించారు. ఇవి నోటిని శుభ్రం చేయడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా నిర్మూలిస్తాయి. ఆధునిక మౌత్‌వాష్‌లు కూడా ప్లాక్, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఆహారంలో విటమిన్-సి ఎక్కువగా ఉండే ఉసిరి, నారింజ, నిమ్మ వంటి పండ్లు, అలాగే విటమిన్-కె ఎక్కువగా ఉండే పాలకూర, మెంతి వంటి ఆకుకూరలు చేర్చుకోవాలి. చివరిగా సంవత్సరానికి రెండుసార్లు దంత వైద్యునితో పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి. చిగుళ్ల నుంచి రక్తం కారడం అనేది శరీరంలో జరుగుతున్న ఏదైనా పెద్ద వ్యాధికి సూచన కూడా కావచ్చు. ఈ సమస్య తరచుగా వస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ ఒక్క ఆకును మీ కిచెన్‌లో ఉంచితే చాలు.. బొద్దింకలు పరుగో పరుగు!