Oppo F31 5G Series: AI ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా..!

ఒప్పో ఎఫ్31 5జీ సిరీస్ భారతదేశంలో విడుదలైంది. ఈ సిరీస్లో ఒప్పో F31 5G, F31 ప్రో 5G, F31 ప్రో+ 5G ఫోన్లు ఉన్నాయి. ఒప్పో F31 5G ప్రారంభ ధర రూ. 22,999, ఒప్పో F31 ప్రో 5G ప్రారంభ ధర రూ. 26,999, ఒప్పో F31 ప్రో+ 5G ప్రారంభ ధర రూ. 32,999గా ఉంది.

New Update
Oppo F31 5G series

Oppo F31 5G series

ఒప్పో(oppo-mobiles) భారత మార్కెట్లో తన F31 5G సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో Oppo F31 Pro+ 5G, Oppo F31 Pro 5G, Oppo F315G వంటి మోడల్స్ ఉన్నాయి. Oppo F31 Seriesలో 7000mAh బ్యాటరీ ఉంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ 50D40 కెమెరా అందించారు. ఇప్పుడు Oppo F31 Pro+ 5G, Oppo F31 Pro 5G, Oppo F31 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం. 

Oppo F31 5G Price

Oppo F31 5G 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. 

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, క్లౌడ్ గ్రీన్, బ్లూ రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 

Also Read :  వివో నుంచి రెండు కిర్రాక్ ఫోన్లు.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో ఫీచర్లు హైలైట్

Oppo F31 Pro 5G Price

Oppo F31 Pro 5G ధర విషయానికొస్తే.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. 

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999.

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 30,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ డెసర్ట్ గోల్డ్, స్పేడ్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Oppo F31 Pro+ 5G Price

Oppo F31 Pro+ 5G ధర విషయానికొస్తే.. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999.

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ జెమ్‌స్టోన్ బ్లూ, హిమాలయన్ వైట్, ఫెస్టివ్ పింక్ కలర్‌లలో లభిస్తుంది. 

Oppo F31 Pro 5G, Oppo F31 Pro+ 5G అమ్మకాలు సెప్టెంబర్ 19 నుండి భారతదేశంలోని అనేక రిటైల్ స్టోర్‌లలో, Oppo అధికారిక సైట్, Flipkart, Amazon వంటి ఇ-కామర్స్ సైట్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభమవుతాయి. అదే సమయంలో Oppo F31 5G అమ్మకాలు సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతాయి. 

Also Read :  వామ్మో.. వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్న బనానా ఏఐ చీర ట్రెండ్

Oppo F31 Pro+ 5G, F31 Pro 5G, F31 5G Specifications

Oppo F31 Pro + 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల అల్ట్రా స్లిమ్ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అదే సమయంలో Oppo F31 Pro 5G, Oppo F31 5G రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల అల్ట్రా స్లిమ్ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఇక ఈ మూడు ఫోన్‌లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో వస్తాయి. వీటికి AGC DT-STAR D + రేటింగ్ అందించారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌ అమర్చారు. దీనితో పాటు Oppo F31 Pro + 5Gలో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అందించారు. అదే F31 Pro 5Gలో MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్, అలాగే F31 5Gలో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ఉన్నాయి. 

ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతుతో పెద్ద 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. F13 5G సిరీస్ Android 15 ఆధారంగా Color0S 15 పై పనిచేస్తుంది. కంపెనీ రెండు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, 3 సంవత్సరాల సేఫ్టీ అప్డేట్‌లను హామీ ఇస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ మూడు ఫోన్ల వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అదే సమయంలో F31 Pro + 5G, F31 Pro 5G లలో 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉండగా.. F31 5G లో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం.. F31 Pro + 5G, F31 Pro 5G లలో 32-మెగాపిక్సెల్ గెలాక్సీ కోర్ 32E2 ఫ్రంట్ కెమెరా ఉండగా.. F31 5G లో 16-మెగాపిక్సెల్ సోనీ IMX480 ఫ్రంట్ కెమెరా అందించారు. 

AI ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే.. F31 Pro 5G, F31 Pro + 5G లలో AI వాయిస్‌స్క్రైబ్, AI కాల్ అసిస్టెంట్ (AI కాల్ సమ్మరీ, AI కాల్ ట్రాన్స్‌లేటర్), AI ఎడిటర్ 2.0 (AI పర్ఫెక్ట్ షాట్, AI రీకంపోజ్, AI క్లారిటీ ఎన్‌హాన్సర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్, AI అన్‌బ్లర్, AI ఎరేజర్ 2.0), AI లింక్‌బూస్ట్ 3.0, AI వాయిస్‌స్క్రైబ్, AI కాల్ అసిస్టెంట్ (AI కాల్ సమ్మరీ, AI కాల్ ట్రాన్స్‌లేటర్), AI ఎడిటర్ 2.0 (AI) ఉన్నాయి. 

అదే సమయంలో F31 5G లో AI ఎడిటర్ 2.0 (AI పర్ఫెక్ట్ షాట్, AI రీకంపోజ్, AI క్లారిటీ ఎన్‌హాన్సర్, AI రిఫ్లెక్షన్ రిమూవర్, AI అన్‌బ్లర్, AI ఎరేజర్ 2.0) ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు