/rtv/media/media_files/2025/09/16/acb-2025-09-16-15-07-01.jpg)
ACB raids electricity official Ambedkar residence in Hyderabad
హైదరాబాద్(hyderabad) లోని మణికొండలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే అంబేద్కర్ బంధువు ఇంట్లో ఏసీబీ అధికారులు రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మణికొండ, నార్సింగి డివిజన్‌లో అంబేద్కర్.. అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్(ADE) గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.
ACB Raids On Electricity Official’s Residence In Hyderabad
Cash piles tumble out in Hyderabad!
— Naveena (@TheNaveena) September 16, 2025
ACB officials on Tuesday launched surprise raids on Ambedkar , Assistant Divisional Engineer (ADE) of the Electricity Department, searching his residences and properties since 5 AM uncover over ₹2 Cr in cash at a relative’s house.
18 teams… pic.twitter.com/qgyRxrXcTA
అలాగే పలు చోట్ల అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.అంబేద్కర్ భారీగా వ్యవసాయ భూములు, ఫ్లాట్స్, భవనాలు కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆయన అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను తన బంధువులను బినామీలగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భాగంగా ఆయన బంధువు ఇంట్లో రూ.2 కోట్లకు పైగా నగదు దొరకడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా()Social Media) లో వైరల్ అవుతోంది.
Also Read: ఆ గ్రామంలో 54 కుటుంబాల సాంఘిక బహిష్కరణ...సెక్షన్ 163 అమలు..అసలేం జరిగిందంటే...