Jurala Project: జూరాలకు భారీగా వరద నీరు.. గేట్ల ఎత్తివేత
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తుందన్నారు. యంగ్ ఇండియా స్కూల్ ప్రణాళిక ఏంటో క్లారిటీ ఇవ్వాలని, అంచనా వ్యయం ఎందుకు మార్చారని ఆమె ప్రశ్నించారు. కవిత ఇష్యూపై కచ్చితంగా పార్టీ స్పందిస్తుందని ఆమె అన్నారు.
సొంతపార్టీపై మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే BJP నేతలు BRSతో కలిసిపోతారని కవిత అన్న మాటలు వందశాతం నిజమేనని గోషామహల్ ఎమ్మెల్యే సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో BJP అభ్యర్థులని డిసైడ్ చేసేది BRSయే అని అన్నారు.
గద్దర్ అవార్డు కమిటీ ఛైర్మెన్ జయసుధ అవార్డుల విజేతలను ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకోగా.. కల్కి, పొట్టేలు, లక్కీ భాస్కర్ ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. 14 ఏళ్ళ తర్వాత తెలంగాణలో మళ్ళీ సినిమా అవార్డులను ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రిటైర్ అయ్యే అంగన్వాడీ ఉద్యోగులకు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయంపై రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
దేశంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో పాటూ ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వలన ఈ సారి పుష్కలంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురుస్తాయని చెప్పింది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే న్యాయనిపుణులతో ఆయన చర్చించినట్లు సమాచారం. జూన్ 5న విచారణకు రావాలని కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తొలిసారి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లనున్నారు.